పవన్ కళ్యాణ్ పక్కన అమ్మడు ఎట్టకేలకు సెట్ అయ్యింది

Pawan-Kalyan - Shruti Haasan - Vakeel Saabపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ, వకీల్ సాబ్ లో హీరో గారి పక్కన నటించే హీరోయిన్ కంఫర్మ్ అయ్యింది. ఈ పాత్ర కోసం లావణ్య త్రిపాఠి, ఇలియానా, పూజా హెగ్డే వంటి పేర్లు వినపడ్డాయి. అయితే తాజాగా శృతి హాసన్ హీరోయిన్ గా కంఫర్మ్ అయినట్టు సమాచారం. ఆమె దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా సైన్ చేసిందట.

గబ్బర్ సింగ్, కాటమరాయుడు తరువాత పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది. చాలా కాలంగా టాలీవుడ్ కి దూరంగా ఉన్న శృతి ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ లో నటిస్తుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమా కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ADVERTISEMENT

ఒరిజినల్ కథలో హీరో సరసన హీరోయిన్ ఉండదు. అసలు హీరో అమితాబ్ బచ్చన్ ఒక వృద్దుడిగా కనిపిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కథను మార్పు చేశాడు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ రీమేక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేతా థామస్, అంజలి, అనన్య (మల్లేశం ఫేమ్) నటిస్తున్నారు.

ఇంతకీ ఈ పింక్ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే.. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఆ ముగ్గురు అబ్బాయిల్లో ఒకరు ఓ అమ్మాయిపై అత్యాచారం చేయాలని చూస్తాడు. ఆమె తప్పించుకునే క్రమంలో బీర్ బాటిల్‌తో అతని తల పగలగొడుతుంది. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తున్న లాయర్ (అమితాబ్ బచ్చన్) ఎలా నెగ్గారు అన్నదే కథ.

ADVERTISEMENT
Latest Stories