ఈ వయసులో ప్రేమించకపోతే ఇంకెప్పుడు?

Shruti Haasan no regrets on breakup with Michael Corsaleస్టార్ డాటర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి క్రేజీ హీరోయిన్ అనిపించుకున్న శ్రుతి హాసన్ కెరీర్‌లో లవ్ స్టోరీలు కూడా ఎక్కువే. ఆ మధ్య ఓ హీరోతో ప్రేమాయణాన్ని కొనసాగించిన ఈ అందాల భామ… ఆ తరువాత ఈ వ్యవహారానికి ముగింపు పలికింది. పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను వరుసగా దక్కించుకుంది.

ADVERTISEMENT

అయితే ఆ తరువాత ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సలే అనే యువకుడితో ప్రేమలో పడిన శ్రుతి హాసన్… అతడిని పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. అతడిని తన తండ్రి కమల్ హాసన్‌కు పరిచయం చేసి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ… సడన్‌గా బాయ్‌ఫ్రెండ్‌కు దూరమై మళ్లీ సినిమాలపై ఫోకస్ చేసింది.

బ్రేకప్ పై శృతి ఒక ఇంటర్వ్యూ లో స్పందించింది. “ఆ ఎపిసోడ్ మొత్తం పాఠం అనుకోవడం లేదు కానీ ఆ రిలేషన్‌షిప్‌ ఓ మంచి అనుభవాన్ని ఇచ్చింది. ‘లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’ అంటారు కదా. అలా అన్నమాట. అయితే నేను ఒక రిలేషన్‌లో ఉన్నందుకు, ఆ తర్వాత బ్రేకప్‌ అయినందుకు పశ్చాత్తాపపడటంలేదు,” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

మళ్ళీ ప్రేమలో పడే అవకాశం ఉందా అంటే కూడా ఆమె పాజిటివ్ గానే స్పందించింది. “ఎందుకు పడకూడదు? నేను ప్రేమలో పడే వయసులోనే ఉన్నాను కదా. ఈ వయసులో ప్రేమకబుర్లు చెప్పకపోతే ఏ వయసులో చెబుతాం. అయితే నేను అనుకుంటున్న ఆ ‘గొప్ప ప్రేమ’ దొరికినప్పుడు ఇలాంటి ప్రేమకోసమే ఎదురు చూశానని తప్పకుండా చెబుతాను,” అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

ADVERTISEMENT
Latest Stories