కొన్ని సినిమాలు టీజర్ మొదలుకొని ట్రైలర్ వరకూ కుమ్మేస్తాయి. అలా అని నమ్మి తొలి రోజే థియేటర్స్ కి వెళ్లామా? తమిళ్ అర్ధం కానీ వాడికి హిందీ సినిమాని చైనా బాషలో చూపించునట్లు ఉంటుంది వాడి పరిస్థితి. అయితే అలా అని అన్నీ అదే కోవకు చెందుతాయి అని చెప్పలేం. ఇక అసలు ఈ కధ అంతా ఎందుకు అసలు మ్యాటర్ లోకి ఎంటర్ అయిపోదామా…అంతర అయితే రండి ఈ మ్యాటర్ తో పాటుగా ఈ ట్రైలర్ పై కూడా ఒక లుక్ వేద్దాం. కొత్త డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నప్పడు కొత్త కొత్త ఐడియాస్ పురుడు పోసుకుంటాయి. బహుశా అలాంటి కోవలోకే వస్తుందేమో మనం మాట్లాడుకోబోయే ఈ సినిమా..ఇంతకీ మనం మాట్లాడుకోబోయే సినిమా పేరు ఏంటి అంటే “శుభలేఖ+లు”.
[m9ad]
ఈ సినిమా హీరో ఇప్పటివరకూ హీరోగా పెద్ద సినిమాలు ఏమీ చెయ్యలేదు కానీ, హీరో తమ్ముడు పాత్రలు, తమిళ్ లో చిన్నా చితకా విలన్ పాత్రలు వేసుకుంటూ ఈ సినిమాలో ఫుల్ టైమ్ హీరో రోల్ చేసిన శ్రీనివాస్. ఇక హీరోయిన్ గా ప్రియ వడ్లమని అనే కొత్త అమ్మాయి పరిచయం అవుతుంది. అయితే ఈ సినిమాలో ఏం బజ్ ఉందో తెలీదు కానీ, ఈ సినిమా హీరోయిన్ పాత్రను టీజర్ రూపంలో ఎనర్జెటిక్ డైరెక్టర్ మారుతి ఆవిష్కరిస్తే, ఈ సినిమా ట్రైలర్ ని ఏకంగా మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు. అయితే ఇలాంటి చిన్న సినిమాలపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపని వారు కూడా త్రివిక్రమ్ కోసం ఈ ట్రైలర్ ని చూస్తూ, గురుజీ కోసం చూస్తున్నా అంటూ కొమెంట్స్ చెయ్యడం విశేషంగా చెప్పుకోవచ్చు.
అయితే ఇక ట్రైలర్ లోకి కాస్త తొంగి చూస్తే ట్రైలర్ అంతా రొటీన్ గానే ఉంది కానీ, పెళ్లి కూతురి గెటప్ లో ఉన్న హీరోయి స్మోక్ చెయ్యడం, ఇక పెళ్లి గురించి, కాబోయే భర్త గురించి ఆమె మాట్లాడే విధానం, మరో పక్క “పెళ్లి”అనే పదాన్ని సీరియస్ గా తీసుకోని ఈ జెనరేషన్ ని చూసి పెద్దలు బాధ పడటం. షరా మామూలుగా అనిపిస్తున్న ఫొర్ములాలా ఉన్నా, ట్రైలర్ మొత్తంగా ఉన్న డిఫరెంట్ విజువల్స్ చూస్తూ ఉంటే ఇదేదో మంచి మెసేజ్ ఇచ్చే మ్యాటర్ లానే ఉంది. మరి అసలే కొత్త నటీ నటులు, మరో పక్క సినిమా దర్శకుడు కూడా కొత్తగా ట్రై చెయ్యాలనే తపనతోనే కనిపిస్తున్నాడు. మరో పక్క ట్రైలర్ ఉన్న షేడ్స్ అన్నీ సినిమాలో ఉంటాయో లేదో అన్న భయం కూడా ఉంటుంది. మరి ఇన్ని కన్ఫ్యూవన్స్, ఇన్ని ట్విస్ట్స్ మధ్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూద్దాం”? మొత్తంగా అయితే ట్రైలర్ వరకూ మాత్రం ఎండింగ్ లో అమ్మాయి పెళ్లి కూతురుగా సిగరెట్ కాలుస్తూ పెళ్లి పత్రిక చదివే షాట్ కోసం ఒక లుక్ వెయ్యొచ్చు.



