siddharth-aditi-rao-wedding

‘బొమ్మరిల్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో సిద్దార్ద్. అలాగే ‘సమ్మోహనం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు అదితి రావు హైదరీ. అయితే 2021 లో వచ్చిన మహాసముద్రం మూవీ ద్వారా మొదటిసారిగా ఈ ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకుని ‘ప్రేమ’ అనే మహాసముద్రంలో పడ్డారు.

Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

ఈ నాలుగేళ్లు ప్రేమ బంధంతో కలిసి తిరిగిన వీరిద్దరూ ఇప్పుడు పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి ఆలయంలో వివాహం జరుపుకున్నారు.

తమ వివాహనికి సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు సిద్దార్ధ్, అదితి. అలాగే నెటిజన్లు కూడా ఈ జంటకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియచేస్తు ఈ ఫొటోస్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

ఇటు ప్రమోషన్స్ తో హీట్ పెంచుతున్నారు దేవర టీం. డివైడ్ టాక్ తో ట్రైలర్ కాస్త నిరాశపరిచినప్పటికి ఈ మూవీ నుండి విడుదలైన అన్ని పాటలు సూపర్ హిట్ అయాయ్యి. అలాగే దేవర టీం తో సందీప్ వంగా చేసిన ఇంటర్ వ్యూ దేవర ప్రేక్షకులను, ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

దేవర కు పోటీగా మరే పెద్ద సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ముందుకు రాకపోవడంతో అటు ప్రీ బుకింగ్స్ లో కూడా దేవర తన రికార్డుల హావ కొనసాగిస్తుంది. అలాగే తెలుగులో తమ అభిమాన నటుడుని ఇంటర్ వ్యూ చేస్తూ విశ్వక్ సేన్, సిద్దు జొన్నల గడ్డ, తారక్ తో చేసిన హడావుడి కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Also Read – వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!

తన ప్రమోషన్స్ తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లగలరు తారక్. అలాగే ఓటిటి రిలీజ్ ఎప్పుడని నన్నడుగుతుందేంటీ సుధా.? అన్నట్టుగా సరిపోదా శనివారం ఈ నెల 26 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన సరిపోదా ఇప్పటికే 100 కోట్లు వసులు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తమిళ దర్శకుడు, నటుడు ఎస్ జె. సూర్య తన నటనతో సరిపోదా శనివారం ను మరో స్థాయికి తీసుకువెళ్లారు. కొన్ని కొన్ని సీన్లలో నానిని కూడా సూర్య డామినేట్ చేశారనే చెప్పాలి.