అర్ధం కాని సింగర్ సునీత స్పందన!

singer Sunitha asks Why People are always curious about personal life'రేణుదేశాయ్ బాటలోనే సింగర్ సునీత కూడా రెండో వివాహం చేసుకోబోతోందని పెద్ద ఎత్తున జరిగిన ప్రచారం తెలిసిందే. 20 ఏళ్ళ కుమారుడు ఆకాష్ మరియు 17 ఏళ్ళ కుమార్తె శ్రేయ కలిగి ఉన్న సునీత ప్రస్తుత వయసు 40. రేణు మాదిరిగానే తోడు కోసం మరో వివాహం చేసుకుంటుందని హల్చల్ చేసిన వార్తలపై ఫేస్ బుక్ వేదికగా సునీత బదులిచ్చింది.

‘ఇతరుల వ్యక్తిగత జీవితాలపై ఎందుకంత ఆసక్తిని కనపరుస్తారు?” అంటూ ఓ ప్రశ్న వేసిన సునీత ఏ రకమైన సమాధానం ఇచ్చిందో అర్ధం కాని పరిస్థితి. ఇంతకీ రెండో పెళ్లి వార్తలను ఖండించినట్లా? లేక తన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో మీకు ఎందులకు? అంటూ ప్రశ్నించినట్టా? అన్నది అర్ధం కాని అంశం. ఏది ఏమైనా సోషల్ మీడియా పుకార్లపై ఈమె గుర్రుగా ఉందన్నది మాత్రం వాస్తవం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories