రోహిత్ ‘సూసైడ్’ కేసులో స్మృతి ఇరానీ పేరు?

smriti-irani-name-in-rohit-suicideహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, ఆ తరువాత జరిగిన పరిణామాలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. ఈ సంఘటనను దళితులకు, దళితేతరులకు మధ్య జరిగిన ఘర్షణగా కొన్ని పార్టీల వారు ప్రచారం చేస్తున్నారని, కానీ అది నిజం కాదని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఈ వివాదానికి కులం రంగు పులిమి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు యత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ నేపథ్యంలో గతంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంత రావు తమ కార్యాలయానికి పంపిన లేఖల గురించి ఆమె ప్రస్తావించారు. విద్యార్థుల మధ్య రేగిన గొడవను కుల యుద్ధంగా పరిగణించరాదని, విద్యార్థులను దత్తాత్రేయ రెచ్చగొట్టారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్మృతి ఇరానీ స్పష్టత ఇచ్చారు. ఈ యూనివర్సిటీలో గత పదేళ్ళలో తొమ్మిది మంది సూసైడ్లు చేసుకున్నారని హనుమంతరావు తన లేఖలో పేర్కొన్నారని, లోగడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చేది కాదని, తాజా ఉదంతానికి సంబంధించి యూనివర్సిటీ వీసీ తెలిపిన వెర్షన్ ను కూడా తాము పరిశీలించామని ఆమె వివరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories