
ఇదే సమయంలో ఈ సినిమా గురించి అనేక సమాచారం హల్చల్ చేసింది. హీరో రామ్ చరణ్ చెవిటి వాడని, హీరోయిన్ సమంత మూగ పాత్రలో నటిస్తోందని… ఇలా పుకార్లు షికారు చేసాయి. అయితే ఏ రకమైన పుకార్లను అభిమానులు నమ్మవద్దని, ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా సోషల్ మీడియాలో ఉన్న తమ అకౌంట్ల ద్వారా తామే తెలియజేస్తామని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన చేయడానికి ముందే సుకుమార్ – రామ్ చరణ్ ల సెల్ఫీ ఫోటోను కూడా పోస్ట్ చేసింది.
ఈ సినిమా షెడ్యూల్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కూడా పాల్గొంటుండడం విశేషం. పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోన్న ఈ దంపతులు తాజాగా భీమవరంలోని మావుళ్ళమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. చెర్రీ ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకున్న మెగా అభిమాన గణం భారీ సంఖ్యలో గుడికి క్యూలు కట్టారు. గుడి లోపల సైతం చెర్రీ – ఉపాసనలను తమ మొబైల్ కెమెరా కళ్ళల్లో బందించాలని అభిమానులు ఉత్సాహం చూపించారు. కొత్త గెటప్ లో చెర్రీ లుక్ అదిరిపోయిందనే టాక్ ఇప్పటికే సర్వత్రా వినపడుతోంది.
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…