ఏంటి గోవిందా..? మరి ఇంతలా ఆడేసుకుంటున్నాడు..?

KCR-Gajwel-Constituency

ఇన్నాళ్లుగా గెలుపు హోదా అనుభవించిన కేసీఆర్ కు బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఓటమి తాలూకా అపహాస్యం ఎలా ఉంటుందో ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుండే మొదలయ్యింది. అంతే గోవిందా….ప్రతి దానిలో వేలు పెట్టి కెలికితే చివరకు మిగిలేది ఇంతే గోవిందా….అన్నట్లుగా కేసీఆర్ దుస్థితి మారిపోయింది.

ఏకంగా ఏడుకొండల వాడి గోవింద నామాల కీర్తనను ప్యారడీ చేసి కేసీఆర్ పాలనను,ఇచ్చిన హామీలు,చేసిన స్కాములు,ఎగ్గొట్టిన పథకాల వివరాలను వివరిస్తూ సోషల్ మీడియాలో కేసీఆర్ ను గట్టిగా ఆడేసుకుంటున్నాడు.గోవిందా..టీఆరెస్ గోవిందా, కారు గుర్తు గోవిందా, డబుల్ బెడ్ రూములు గోవిందా,లక్ష కొలువులు గోవిందా,ఇంటికో ఉద్యోగం గోవిందా, కాళేశ్వరము గోవిందా,ధరణి పని ఇక గోవిందా,దళిత బందు గోవిందా,మిషన్ భగీరధ గోవిందా….అంటూ ఇక పదేళ్ల కేసీఆర్ పాలనను ఒక కీర్తనలో పొందుపరిచి సోషల్ మీడియాలో వదిలారు.

ADVERTISEMENT

అలాగే ప్రగతి భవన్ నుండి తట్టా బుట్టా సర్దుకుని పోతున్న కలవకుంట్ల కుటుంబం అంటూ పోస్టర్లు డిజైన్ చేసి సామజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.ఇక ఎవరి టాలెంట్ ఎంత, వాడుకున్నోడికి వాడుకున్నంత అంటూ ఒకరి మీద ఒకరు పోటీ పడి మరి సామాజిక మాధ్యమాలలో కేసీఆర్ మీద వీడియోలు, పోస్టర్లు రెడీ చేస్తున్నారు నెటిజన్లు.ఇన్నాళ్లు అధికారం ఉంది అనే అహంతో మాట్లాడిన కేసీఆర్ పదవి పోగానే కనీసం ప్రజలను కూడా ఫేస్ చేసే ధైర్యం కూడా చేయలేకపోవడం చూస్తుంటే పదవులను అడ్డుపెట్టుకొని ఏదైనా చేసేయొచ్చు అని విర్రవీగే నాయకులకు కేసీఆర్ ను ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.

రాజకీయాలలో అధికారం శాశ్వతం కాదు.ఎంతటి నాయకుడైనా ప్రతిపక్షంలోకి రావాల్సిందే. జీరో నుండి ఇక్కసారిగా హీరోగా మారిన నాయకులు ఇదేతరహా పోకడలకు పోతే మళ్ళీ ప్రారంభించిన చోట నుండే మొదలుపెట్టాల్సి వస్తుంది. ఇప్పటికైనా కొందరు నాయకులు ఈ విషయాన్నీ గ్రహిస్తే రాష్ట్రము బాగుపడుతుంది. లేకుంటే వారికి కూడా ఇదే తరహా భజనా కార్యక్రమాలు మొదలవుతాయని గుర్తుంచుకోవాలి గోవిందా…!

ADVERTISEMENT
Latest Stories