అక్కినేని కూడా ‘ల్యాండ్’ అవుతున్నారు! సమరం షురూ!

soggade chinni nayana in sankranthi raceసంక్రాంతి రాబోతున్న మూడు పెద్ద సినిమాలలో ఇప్పటికే ఒక చిత్రం “డిక్టేటర్” ఆడియో వేడుకను జరుపుకోవడంతో, జనవరి 14వ తేదీకి ’కర్చీఫ్’ వేసుకున్నారు. మరో మూవీ “నాన్నకు ప్రేమతో” పాటల వేడుకను 27వ తేదీగా డిక్లేర్ చేయగా, సినిమాకు జనవరి 13న ‘స్లాట్’ బుక్ చేసుకున్నారు. ఇక మిగిలి ఉన్న అక్కినేని నాగార్జున సినిమా “సోగ్గాడే చిన్నినాయనా” చిత్రంపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో పోటీ నుండి తప్పుకుంటారేమోనన్న భావన ఏర్పడింది.

అయితే ఊహాగానాలకు తెరదించుతూ “సోగ్గాడే చిన్నినాయనా” ఆడియో విడుదలను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో పాటల వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ద్వారా మార్కెట్ లోకి రానున్నాయి. ఇటీవల విడుదలైన సినిమా ధియేటిరికల్ ట్రైలర్ ప్రేక్షకాధరణ పొందడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

‘కింగ్’ నాగార్జున డ్యూయల్ రూల్ తో పాటు రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, అనసూయ భరద్వాజ, హంసా నందిని వంటి ముద్దుగుమ్మలతో కళకళలాడుతున్న సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పై నాగార్జున స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల తేదీని ఆడియో వేడుకపై ప్రకటిస్తారని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories