కార్పొరేట్ ‘కెలుకుడు’ ఇలాగే ఉంటుంది మరి!

Alright “Boom Boom” Beginning For Spyderప్రిన్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన “స్పైడర్” సినిమాలోని మొదటి పాట వచ్చింది. ఈ పాట ఎలా ఉందన్నది ఒక్క నిముషం పక్కన పెడితే, ఈ పాట విడుదల అభిమానులతో సహనాన్ని పరీక్షించడం విశేషం. చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించిన సమయం ప్రకారం బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కావాల్సి ఉంది. కానీ ఆరు దాటి ఏడు, ఎనిమిది అయినా పాట విడుదల కాలేదు. మధ్యలో మరింత ఊరించే విధంగా ఇంకో అరగంట, ఇంకో గంట అంటూ సినీ ప్రేక్షకులను ఎదురుచూసేలా చేసారు.

నిజానికి ఈ పాట విడుదలైంది ఆరు గంటలకే, అయితే అది యూ ట్యూబ్ ద్వారా కాదు. ముందుగా ‘జియో మ్యూజిక్’ యాప్ ద్వారా ఈ పాటను ఆరు గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఇక్కడే కార్పొరేట్ ‘కెలుకుడు’ ఏ రేంజ్ లో ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. రిలయన్స్ సంస్థకు చెందిన ‘జియో మ్యూజిక్ యాప్’ను మరింతగా ప్రచారం పొందేలా ముందుగా ‘జియో మ్యూజిక్’లో విడుదల చేయడంతో, ఆరు గంటలకు పాట కోసం ఆతృతగా ఎదురుచూసిన అభిమానులంతా ‘జియో మ్యూజిక్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మరీ విన్నారు.

ADVERTISEMENT

సరే… ఆ తర్వాత అయినా విడుదల యూ ట్యూబ్ లో ఉంటుందా? అంటే అది లేకుండా పోయింది. ‘జియో మ్యూజిక్’ యాప్ తర్వాత ‘సావన్’ యాప్ లో విడుదల చేసి అభిమానుల సహనాన్ని మరింతగా పరీక్షించారు. ఇక ఫైనల్ గా ఆరు గంటలకు యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కావాల్సిన పాట రెండున్నర్ర గంటలు ఆలస్యంగా… అంటే ఎనిమిదిన్నర్ర గంటలకు యూ ట్యూబ్ లో దర్శనమిచ్చింది. దీంతో ఫైనల్ గా లిరికల్ వీడియో రావడంతో ప్రిన్స్ అభిమాన గణం ఊపిరి పీల్చుకుంది.

ఇక, పాట ఎలా ఉంది అన్న దానికి వస్తే… ఉదయం ఆటకు విడుదల కావాల్సిన సినిమా, సాయంత్రం ఆటకు విడుదల అయితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అలాగే ఉంటుందని చెప్పాలి. సమయానికి విడుదల చేయకపోతే ఉన్న ఉత్సాహం కాస్త నెగటివ్ గా మారి నిరుత్సాహానికి దారి తీస్తుందన్న వైనం ‘స్పైడర్’ తొలి పాట సందర్భంగా నిరూపణ అయ్యింది. ఈ ఆలస్యానికి సదరు ‘జీ మ్యూజిక్ సంస్థ’ ఇచ్చిన వివరణ మరింత కామెడీగా మారింది… కారణం ఏదైనా శాటిలైట్ పైకి తోసేయ్యడం సర్వసాధారణమే కదా!

ఇక్కడే 14 రీల్స్ సంస్థను ఓ సారి గుర్తు చేసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే “స్పైడర్” విషయంలో పొరపాటునో లేక గ్రహపాటునో ఆలస్యం జరిగిందో… సరిగ్గా ఇలాంటి ఆలస్యమే 14 రీల్స్ సంస్థ మహేష్ తో నిర్మించిన “1 నేనొక్కడినే, ఆగడు” సినిమాల విషయంలో జరిగింది. వాటి ఫలితాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ కూడా ‘యూరోస్ ఇంటర్నేషనల్’ అనే కార్పొరేట్ సంస్థ వేలు పెట్టిన సంగతి తెలియనిది కాదు. ఇలా అభిమానులతో ఆడుకోవాలన్న ప్రయత్నాలకు నిర్మాణ సంస్థలు తిలోదకాలు ఇస్తే మంచిదన్న విషయం చరిత్ర నేర్పింది.

‘స్పైడర్’ ప్రమోషన్స్ లో ఇక నుండి అలాంటి వాటికి చోటు లేకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త దర్శకుడు మురుగదాస్ తో పాటు హీరో ప్రిన్స్ మహేష్ బాబు పైన కూడా ఉంది. లేదంటే మరోసారి ప్రతికూల ఫలితాన్ని చవిచూసిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ముఖ్యంగా బడా కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం అయినపుడే ఇలాంటి ఇబ్బందులు ఎదురుకావడం విశేషం. బహుశా ఆ కార్పొరేట్స్ అంటే… శాటిలైట్స్ కు కూడా ఇష్టం లేదేమో… ఒక్కసారి ‘జీ మ్యూజిక్ సంస్థ’ పరిశీలిస్తే మంచిదేమో..!

ADVERTISEMENT
Latest Stories