“స్పైడర్” వాయిదాలకు అసలు కారణం!

Spyder Mahesh Babu Movie Latest Newsజూన్ 23వ తేదీన విడుదల అని స్వయంగా దర్శకుడు మురుగదాస్ ప్రకటించిన తర్వాత, దానిని ప్రిన్స్ మహేష్ బాబు ధృవీకరించిన తర్వాత కూడా “స్పైడర్” సినిమా వాయిదా పడడం అభిమానులకు రుచించని అంశంగా మారింది. వాయిదా అయితే పడింది గానీ, ఆ తదుపరి రిలీజ్ డేట్ ను ప్రకటించకుండా గ్రౌండ్ ను ఖాళీగా ఉంచారు చిత్ర యూనిట్. ఆగష్టు 11 అని కాసేపు, కాదు కాదు ఆగష్టు 25 అని ఇంకాసేపు ఇలా వార్తలు హల్చల్ చేస్తుండగా, అసలు ఈ వాయిదాలకు గల కారణం ఏంటి? అన్నది ఆసక్తికరంగా మారింది.

తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు “స్పైడర్” ఆలస్యం వెనుక గ్రాఫిక్స్ వర్కే ప్రధాన కారణమని తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన “బాహుబలి 2” సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉండడంతో, ఇంతే సహజత్వంతో ‘స్పైడర్’లో గ్రాఫిక్స్ ను కూడా ఉండాలన్న చిత్ర యూనిట్ అభిలాషతో, ఈ సినిమాను వాయిదా వేసినట్లుగా సమాచారం. ‘బాహుబలి’కి గ్రాఫిక్స్ అందించడంలో కీలక పాత్ర పోషించిన మకుటతోనే ‘స్పైడర్’కు సంబంధించిన గ్రాఫిక్స్ ను సిద్ధం చేస్తున్నారట.

ADVERTISEMENT

అయితే ఈ విషయంలో తనకు తగినంత సమయం కావాలని మకుట ముందుగానే చెప్పడంతో, నాణ్యత పరంగా ఎలాంటి లోపం ఉండకూడదన్న ఉద్దేశంతో ‘స్పైడర్’ యూనిట్ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కారణం చేతనే ‘స్పైడర్’ వాయిదాలు పడుతోందని, అయితే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ కు ‘గుమ్మడికాయ’ కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం “స్పైడర్” టీజర్ అయితే సిద్ధమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories