పూనకాలకి సిద్ధమవుతున్న ఫ్యాన్స్!

Spyder Teaser release on Mahesh babu birthdayసూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రిన్స్ మహేష్ బాబు తొలి టీజర్ కు అభిమానులు పట్టిన నీరాజనం తెలిసిందే. ఆల్ టైం టీజర్స్ రికార్డ్స్ ను పూనకం వచ్చినట్లుగా తొలి 24 గంటల్లోనే “స్పైడర్” వశం చేసిన అభిమానగణానికి త్వరలోనే మళ్ళీ అలాంటి వాతావరణమే ఏర్పడబోతోంది. ఇందుకు వేదికగా ఆగష్టు 9వ తేదీన ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజును ఎంచుకోబోతున్నట్లు సమాచారం.

తొలి టీజర్ ను ‘గ్లిమ్స్ ఆఫ్ స్పైడర్’గా అభివర్ణించిన చిత్ర యూనిట్… ఈ సారి మాత్రం అసలైన టీజర్ గా విడుదల చేయబోతోంది. ప్రిన్స్ జన్మదినం రోజున విడుదల కాబోయే ఈ టీజర్ లో సినిమా కాన్సెప్ట్ ను పూర్తిగా రివీల్ చేసే విధంగా ఉండబోతోందని లభించిన విశ్వసనీయ సమాచారం. ‘గ్లిమ్స్’ ఫ్యాన్స్ ను పూర్తిగా సంతృప్తి పరచడంతో, నెట్టింట పూనకం వచ్చినట్లుగా రెచ్చిపోవడానికి అభిమానులు సన్నద్ధం అవుతున్నారు.

ADVERTISEMENT

మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కధ బయో టెర్రరిజం గురించి డీల్ చేయబోతోంది. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ “స్పైడర్” సినీ ప్రేక్షకుల సరదా పూర్తిగా తీర్చేస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అదే జరిగితే… నెట్టింట్లోనే కాదు… ధియేటర్లలో కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించినట్లే..! వాటి పర్యవసానాలు చవిచూడడానికి టాలీవుడ్ బాక్సాఫీస్ సిద్ధంగా ఉండడమే తరువాయి..!

ADVERTISEMENT
Latest Stories