ఈ ‘కటౌట్’ను చూస్తే ‘వావ్’ అనాల్సిందే!

Sree Vishnu First Look Veera Bhoga Vasantha Rayaluఈ పోస్టర్ లో ఉన్న హీరో ఎవరో గుర్తించారా? లేదంటే ఒక్కసారి “అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కధ” వంటి సినిమాల ద్వారా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణును గుర్తుకు తెచ్చుకోండి. మళ్ళీ ఒకసారి ఈ పోస్టర్ లోని హీరోను తీక్షణంగా చూస్తే… ఆ శ్రీవిష్ణు, ఈయన ఒకేలా అనిపిస్తారు. అవును… శ్రీవిష్ణు మేకోవర్ అయిన పోస్టర్ ఇది.

[m9ad]

ADVERTISEMENT

ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతోన్న “వీరభోగవసంతరాయలు” సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న శ్రీవిష్ణు లుక్ ను తాజాగా విడుదల చేసారు. ఈ పోస్టర్ ను చూసిన వాళ్ళంతా విష్ణు మేకోవర్ కు ఫిదా అవుతున్నారు. మరీ గుర్తు పట్టలేనంత రీతిలో శ్రీవిష్ణు మారిపోవడం, అతని పట్టుదలకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే భయంకరంగా ఉన్నాడు శ్రీవిష్ణు.

ఇంద్రసేన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నారా రోహిత్, సుధీర్ బాబులు కూడా కీ రోల్స్ చేస్తుండగా, మరో ప్రధాన పాత్రలో టాప్ హీరోయిన్ శ్రియా కన్నులవిందు చేయనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో, చిత్ర యూనిట్ అంతా సక్సెస్ పట్ల ఎంతో ఆశాభావంతో ఉంది.

ADVERTISEMENT
Latest Stories