ఫేస్ బుక్ వేదికగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు సంబంధించిన బిగ్ షాట్స్ పేర్లు బయటపెట్టిన శ్రీరెడ్డి, తాజాగా ఓ పెద్ద హీరో కుమార్తెపై విమర్శల వర్షం కురిపించింది. ఇంతకీ ఆ పెద్ద హీరో కుమార్తె ఎవరు అనుకుంటున్నారా? ఆ పేరునైతే నేరుగా ప్రస్తావించలేదు గానీ, యధావిధిగా ఆమె ఎవరన్న దానిపై స్పష్టమైన హింట్స్ ను ఇచ్చింది శ్రీరెడ్డి.
‘ఓ మహిళగా మిమ్మల్ని నేను గౌరవిస్తాను, దానిని మీరు పోగొట్టుకోవద్దు, మీరు సినిమాలు తీసారు, మీకు ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయి, అలాగే బిగ్ ఆర్టిస్ట్ కూతురు కాబట్టి మీకు మా బాధలు తెలియకపోవచ్చు’ అంటూ ప్రారంభించిన శ్రీరెడ్డి, ‘అడ్డదారిలో వెళ్లాను, దిగజారిపోయాను’ అంటున్నారు, మాటలు సరిగ్గా రానీయండి, లేదంటే బాగోదంటూ తీవ్రంగా హెచ్చరించింది.
‘మీరు పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు, మీరు కో ఆర్డినేటర్ సిస్టంపై మాట్లాడుతున్నారు, అసలు అదే బాలేదని నేను అంటున్నాను, నార్త్ ఇండియన్ హీరోయిన్స్ ను మీ ఇంట్లో పెట్టుకుని మీరు పోషించినవి నాకు బాగా తెలుసు, మీపై ఉన్న రూమర్లు గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు’ అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది.
మా అసోసియేషన్ లో మీరు ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నారని మిమ్మల్ని గౌరవించలేను, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి, ఇప్పటివరకు నిన్ను పిలుస్తున్న ‘అక్క’ అన్న పదానికి నీకు అర్హతే లేదంటూ ఆమె ఎవరన్న దానిపై హింట్ ఇచ్చింది. మీరు ఎవరెవరిని ప్రోత్సహిస్తారో నాకు తెలుసు, కనీసం ఇప్పటినుండైనా తెలుగు ఆరిస్ట్ లను ప్రోత్సహించండి…. అంటూ పిలుపునిచ్చింది.



