నా లిస్టు కాదు… ఆ హీరోయిన్ల లిస్టు చాలా పెద్దది… శ్రీరెడ్డి!

Sri Reddy-ఫేస్ బుక్ వేదికగా టాలీవుడ్, కోలీవుడ్ నటులపై, సాంకేతిక నిపుణులపై సెక్సువల్ ఆరోపణలు చేస్తోన్న శ్రీరెడ్డి తాజాగా పోస్ట్ చేసిన ఓ సందేశం కలకలం రేపుతోంది. కొంతమంది జనాలు నా జాబితాలో చాలామంది ఉన్నారని అనుకుంటున్నారని, కానీ అది తప్పని, తన లిస్టు చాలా చాలా చిన్నదని అభిప్రాయపడింది.

ADVERTISEMENT

అయితే ఇతర హీరోయిన్లు అంటూ పూర్తి పేర్లు బయటపెట్టకుండా, వీక్షకులకు అర్ధమయ్యే విధంగా ఆయా టాప్ హీరోయిన్ల పేర్లల్లో ఒకటి రెండు అక్షరాలు మిస్ చేస్తూ పోస్ట్ చేసింది. “tris..,nay..t..a,ka..l,sa..t..” వీళ్ళంతా మంచి నటీమణులు, టాప్ హీరోయిన్లు కూడా!

ఈ హీరోయిన్లంతా వారి లిస్టు ను ఓపెన్ చేస్తే, ఆ పెద్ద లిస్టు విని మీరంతా చచ్చిపోతారు… అంటూ శ్రీరెడ్డి సంచలన పోస్ట్ చేసింది. ఆ పేర్లల్లో అక్షరాలు మిస్ అయినా… ఆ టాప్ హీరోయిన్లు ఎవరో అందరికీ తెలిసిందే. తన లాంటి వారికీ మాత్రమే అవకాశాలు రాకుండా, ఇతర హీరోయిన్లకు ఎలా అవకాశాలు వస్తున్నాయి? అన్న దానిపై పరోక్షంగా తన భావాలను బయటపెట్టింది శ్రీరెడ్డి.

ADVERTISEMENT
Latest Stories