శ్రీదేవి vs సుగుణ సుందరి – ఎవరిది పైచేయి

Sridevi and Suguna Sundari  Who has the upper handఒకే సీజన్ అది కూడా సంక్రాంతి బరిలో నువ్వా నేనా అని తలపడుతుండటంతో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిల మధ్య ఎంత వద్దనుకున్నా ప్రతి అంశంలోనూ పోలిక వచ్చేస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అభిమానులు మాదంటే మాదంటూ గొప్పలు పోవడం మాములే. ఫస్ట్ ఆడియో సింగల్ విషయంలో బాస్ పార్టీ ముందు నెగటివ్ ట్రోలింగ్ కు గురై తర్వాత ఎక్కేసి ఇప్పుడు ముప్పై మిలియన్ల వ్యూస్ కు దగ్గరగా వెళ్లిపోయింది. రిలీజ్ కు ముందు పాజిటివ్ గా మాట్లాడుకున్న జై బాలయ్య పాట బయటికి వచ్చాక ఒసేయ్ రాములమ్మ సౌండ్ టైపులో ఉందంటూ మొదట్లో విమర్శలు తెచ్చుకుని ఫైనల్ గా పర్వాలేదు అనిపించుకుంది. మొదటి పాట విషయంలో దేవిదే పైచేయి.

ఇప్పుడు రెండో పాటలు బయటికి వచ్చేశాయి. ఈ మధ్య సుగుణ సుందరి అంటూ బాలయ్య శృతి హాసన్ ల మధ్య డ్యూయెట్ ని వదిలారు. ట్యూన్ మరీ గొప్పగా లేకపోయినా వినగా వినగా క్యాచీగా వెళ్లిపోయేలా ఉందని ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆడియో కన్నా ఎక్కువగా బాలయ్య ఎనర్జీ, సింపుల్ గా అనిపించే స్టెప్పులు బాగా వర్కవుట్ అయ్యాయి. తాజాగా నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి అంటూ చిరు మళ్ళీ అదే శృతితో జత కలిసి మంచు కొండల్లో డాన్స్ చేసిన పాట విడుదల చేశారు. పిక్చరైజేషన్, కంపొజిషన్ అంతా దేవి రెగ్యులర్ స్టైల్ లోనే ఉన్నప్పటికీ ఇదీ మెల్లగా ఎక్కేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ రెండు రోజులు ఆగితే బాగా రీచ్ అవుతుందని ఆశిస్తున్నారు.

ADVERTISEMENT

ఇక్కడ ఈ సుగుణ సుందరి వర్సెస్ శ్రీదేవిలో ఎవరిది గెలుపు అంటే ప్రస్తుతానికి టై అనే చెప్పాలి. అరవై దాటిన కమర్షియల్ స్టార్లకు వాళ్ళ వయసును దృష్టిలో ఉంచుకుని కంపోజ్ చేయడం సంగీత దర్శకులకు ఛాలెంజ్ గా మారింది. పాతికేళ్ల క్రితం ఏవైతే చిరు బాలయ్యల మీద అంచనాలు ఉండేవో ఇప్పుడూ అవే అభిమానులు ఆశించడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. అందుకే ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయి యావరేజ్ గా ఉన్నది ఫ్లాప్ గానూ సోసోగా ఉన్నవి డిజాస్టర్ గానూ అనిపిస్తున్నాయి. లక్కీగా ఈ నాలుగు పాటలకు మరీ అంత నెగటివ్ అయితే రాలేదు. తమన్ దేవిశ్రీ ప్రసాద్ ల ముందు ఇంకా బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించిన పెద్ద సవాల్ రాబోతోంది.

ఇక మిగిలిన పాటల బాలన్స్ ఇంకో రెండు వారాల్లో పూర్తి చేసేస్తారు. వాల్తేరు వీరయ్య నుంచి ఒక డ్యూయెట్, చిరు రవితేజల పూనకాలు లోడింగ్ అనే కాంబినేషన్ సాంగ్ రావాలి. ఇవి కాకుండా థీమ్ సాంగ్ ఒకటి పెండింగ్ ఉంటుంది. వీరసింహారెడ్డిలోనూ మరో రెండు డ్యూయెట్లు, పెద్ద బాలయ్యకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లైన్ లో పెట్టారు. ఇవి వచ్చే లోపు పోలికలు పీక్స్ కు చేరుకుంటాయి. వారసుడుతో వచ్చి పడిన థియేటర్ల పంచాయితీ సంగతేమో కానీ చేతిలో ఉన్న ఇరవై రోజుల గడువులో మైత్రి మూవీ మేకర్స్ కు ఈ పాటల రిలీజులు, సోషల్ మీడియా ప్రమోషన్లు, ట్రైలర్ కట్లు, బిజినెస్ వ్యవహారాలు అబ్బో టైం చాలా టైట్ కాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories