శ్రీజ వివాహం – బిందెలో ‘ఉంగరం’ ఎవరు తీసారు!

Srija weddingమెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ వివాహ వేడుకలు అద్భుతంగా జరగడంతో 31వ తేదీన జరగబోయే రిసెప్షన్ కోసం మెగా ఫ్యామిలీ సన్నాహాలు చేసుకుంటోంది. అయితే శ్రీజ వివాహ వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సందడి సందడిగా కనపడుతున్న ఈ ఫోటోలలో పెళ్లిలో పసందైన ఆట అయిన ‘బిందె’లో ఉంగరం తీసే విషయంలో వధూవరులు పోటీపడ్డ ఫోటో హైలైట్ గా కనపడుతోంది. వెండి బిందెలో శ్రీజ – కళ్యాణ్ లు చేతులు పెట్టి ఉంగరం కోసం అన్వేషిస్తుండగా, పక్కన ఉన్న వారంతా వారిని ప్రోత్సహిస్తూ సందడి చేస్తున్న వైనం వీక్షకులను ఆకట్టుకుంటోంది.

ADVERTISEMENT

పెళ్లి అయిన తర్వాత ఎవరిది ఆధిపత్యం అన్న దానికి నిదర్శనంగా పెద్దలు ఈ ‘ఉంగరం’ ఆటను లెక్కిస్తారు. మరి ‘బిందె’లో మూడు సార్లు వేసిన ఉంగరం ఎవరెన్ని సార్లు తీసారో తెలియదు గానీ, ఫోటోలో కనపడుతున్న ఉత్సాహం చూస్తుంటే మాత్రం మెగా వారసురాలిదే ఆధిపత్యం అంటున్నారు వీక్షకులు.

ADVERTISEMENT
Latest Stories