‘సర్దార్’ తర్వాత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించబోతున్న తదుపరి సినిమా ఏంటి? బుల్లితెరపై ఫోకస్ పెడతాడని కొందరంటుంటే, సినిమాలు చేస్తాడని మరికొందరు అంటున్నారు. ఈ క్రమంలో తెరపైకి వచ్చింది ఓ తమిళ మూవీ. రెండేళ్ల కిందట కోలీవుడ్‌లో బంపర్ హిట్టయిన ‘వీరం’ ఫిల్మ్‌ని రీమేక్ చేయనున్నాడనేది తాజా సమాచారం.
అజిత్ – తమన్నా జంటగా వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీసు వద్ద 120 కోట్లకు పైగానే వసూలు చేసింది. యాక్షన్, కామెడీ వంటివి అంశాలు పుష్కలంగా వుండడంతో ఈ సినిమా పవన్ కు బాగానే నచ్చేసిందని టాక్. కాకపోతే, ఈ సినిమా రీమేక్ ప్రయత్నాలను మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడట.
ఈ సారి మాత్రం ‘వీరం’ రీమేక్ చేయాలని మొగ్గు చూపుతున్నారట. ఈ రీమేక్ ను ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలు మైత్రి మూవీస్ లో నిర్మించేందుకు ముందుకొచ్చారని ట్రేడ్ టాక్. ఒకవేళ ఓకే అయితే ‘వీరం’ డైరెక్ట్ ఎవరు? ఇటు ‘ఖుషీ2’ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని పవన్ ఆలోచన. ఈ లోగా ఎస్.జె.సూర్య తమిళంలో హీరోగా ఓ మూవీ చేస్తున్నాడు. ‘ఖుషీ-2’ డిలే అయితే ‘వీరం’ మొదలవ్వడం ఖాయమని చెబుతున్నారు సినీ వర్గాల మాట. దీంతో ‘సర్ధార్’ తదుపరి సినిమాపై ఆసక్తి కొనసాగుతోంది.





