నా కెరీర్ ఇలా ఉండడానికి కారణం శ్రీనువైట్లే!

srinu-vaitla-supported-lyricist-rama-jogayya-sastry‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి తర్వాత ఆ పోకడ సాహిత్య విలువలు అందించే రచయితగా రామజోగయ్య శాస్త్రి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు వర్ధమాన రచయితలలో రామజోగయ్య పేరు ప్రస్తుతం టాప్ స్థానంలో వినపడుతోంది. అయితే తానూ ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి తన కెరీర్ తొలినాళ్ళల్లో దర్శకులు కల్పించిన అవకాశాలేనని, అందులోనూ ముఖ్యంగా శ్రీనువైట్ల ఇచ్చిన సహకారం బాగా దోహదపడిందని చెప్పారు సుప్రసిద్ధ రచయిత రామజోగయ్యశాస్త్రి.

‘డీ’ సినిమాకు గానూ ఒక్క పాట కోసం పిలిపించిన శ్రీనువైట్ల, మొత్తం మూడు పాటలను రచించారని, ఆ తర్వాత ‘దుబాయ్ శీను’ సినిమాలో మొత్తం 5 పాటలకు అవకాశం కల్పించారని, అక్కడ నుండి మొదలు శ్రీనువైట్ల సినిమా అంటే రామజోగయ్య శాస్త్రి రచయితే అన్న పేరు పడిందని, శ్రీనువైట్ల ద్వారా పరిచయమైన మణిశర్మ ద్వారా మరికొన్ని అవకాశాలు తనను వరించాయని, ఇవన్నీ తన కెరీర్ ఎదగడానికి దోహదపడ్డాయని ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ అధినేతకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనోగతాన్ని బయటపెట్టారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories