రాజమౌళిని కూడా వదలని పవన్ కళ్యాణ్ ఫీవర్!

ss rajamouli No1 Yaari With Ranaబుల్లితెరపై రంగ ప్రవేశం చేయబోతున్న రానా “నెం.1 యారి” కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుండి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. తొలి ఎపిసోడ్ ను సుమంత్ – నాగచైతన్యలతో కలిసి ప్రారంభించనున్న రానా, వీక్షకులకు కావల్సినంత కిక్ ను అయితే పంచలేకపోయాడు. చూడడానికే కాదు, వినడానికి కూడా సుమంత్ – చైతూల ఎపిసోడ్ క్రేజ్ ను సొంతం చేసుకోకపోవడంతో, వెంటనే రెండవ వారం ప్రోమోను కట్ చేసి విడుదల చేసారు.

‘బాహుబలి’ సృష్టికర్త రాజమౌళి మరియు ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డలు పాల్గొన్న ఈ వీడియో ప్రోమోను విడుదల చేయగా, కొద్ది నిముషాల్లోనే అది కాస్త వైరల్ అయ్యింది. దీనికి కారణం లేకపోలేదు… ఎందుకంటే… ఆ ప్రోమోను ప్రజెంట్ ట్రెండ్ కు తగినట్లుగా, ప్రేక్షకుల అభిరుచికి అద్దం పట్టేలా కట్ చేసారు కాబట్టి! ప్రభాస్ తో ‘అమ్మా నియమ్మా’ అన్న బూతుతో, పవన్ కళ్యాణ్ పేరుతో ‘నెం.1 యారి’ ప్రోమో సోషల్ మీడియాలో అల్లాడుతోంది.

ADVERTISEMENT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఫోన్ చేసిన రాజమౌళి… డార్లింగ్ ఒకసారి కలవాలి అనగా, దానికి ప్రభాస్ ఎందుకు అని అడుగుతాడు. ‘బాహుబలి 3’ కోసం అని జక్కన్న చెప్పగానే, ‘అమ్మా నియమ్మా’ అంటూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభాస్ అనడం ఒకటైతే… వరుసగా హీరోల పేర్లు చెప్తూ బాణాలు విసురుతున్న రాజమౌళికి, పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే గురి చూసి సెంటర్లో తగలడంతో కట్ అయిన ప్రోమో వీక్షకులకు కన్నులవిందుగా మారింది.

అయితే సమయం సందర్భం ఉన్నా, లేకున్నా ఇటీవల సర్క్యూలేట్ అవుతోన్న ప్రతి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం పరిపాటిగా మారిపోయింది. దీనికి రాజమౌళి కూడా ఏమీ మినహాయింపు కాదని అర్ధమైంది. పవన్ కు తోడుగా ఈ సారి ప్రభాస్ తో బూతు మాట కూడా అనిపించడం అనేది టీఆర్పీ రేటింగ్స్ కోసమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితేనేం… టీఆర్పీ రేటింగ్స్ బద్దలయ్యే విధంగా ఆసక్తిని కలిగించడంలో ప్రోమో సూపర్ సక్సెస్ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories