గడచిన దశాబ్ధ కాలంలో ఏ తెలుగు టెలివిజన్ చానల్ సాధించలేకపోయిన రికార్డును సాధించామని ‘స్టార్ మా’ ప్రకటించింది. 1000 ప్లస్ జీఆర్పీ మార్కును తాను సాధించామని, బిగ్ బాస్ సీజన్-2 గ్రాండ్ ఫినాలే 14.7 టీవీఆర్ ను సాధించిందని ‘స్టార్ మా’ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆదివారం ప్రసారయ్యే బ్లాక్ బస్టర్ ను 51 శాతం మంది టీవీ ప్రేక్షకులు చూస్తున్నారని స్పష్టం చేసారు.
[m9ad]
ADVERTISEMENT
అలాగే ప్రైమ్ టైమ్ కార్యక్రమాలకు 40 శాతం ఆదరణ ఉందని తెలిపింది. వారాంతంలో ప్రసారమవుతున్న ‘పెళ్లిచూపులు’ కార్యక్రమానికి 12.2 టీవీఆర్ వస్తోందని, సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాయంత్రం 6 నుంచి 9.30 గంటల మధ్య 40 శాతం వ్యూవర్ షిప్ తమదేనని పేర్కొంది.
ADVERTISEMENT



