సుబ్బరాజు ‘బీపీ డౌన్’ అయ్యేటంత ఏం జరిగింది?

Subbaraju SIT Investigation Tollywood Drugs caseటాలీవుడ్ ను పట్టి కుదిపేస్తున్న డ్రగ్స్ స్కాండల్ ను తుడిచిపెట్టేందుకు నిర్ణయించిన సిట్ ముందు విచారణకు హాజరైన సినీ నటుడు సుబ్బరాజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సిట్ అధికారులకు ఏ మాత్రం సహకరించ లేదని, దీంతో అకున్ సబర్వాల్ విచారణలోకి ఎంట్రీ ఇచ్చారని, ఆ తరువాత కూడా అదే వైఖరి ప్రదర్శించారని వార్తలు వస్తున్నాయి. దీంతో సాయంత్రం ఐదు గంటల తరువాత అధికారులు సుబ్బరాజుకు కొన్ని వీడియోలు చూపించడంతో, అంతవరకు ఎంతో గంభీరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆందోళనలో పడిపోయాడట. అంతేకాదు, సదరు వీడియోలను బోరున విలపించినట్లుగా మీడియా వర్గాల న్యూస్.

అనంతరం సిట్ అధికారులు శీలం శ్రీనివాసరావు, జి.శ్రీనివాస్ తో పాటు, ఏఈఎస్‌ పవన్‌ కుమార్‌ లు…. మీకు డ్రగ్స్‌ అలవాటు ఉందా? పూరి జగన్నాథ్‌ తో మీకున్న డ్రగ్స్‌ సంబంధం ఏంటి? మీకు కెల్విన్‌ తెలుసా? సినీ పరిశ్రమలో డ్రగ్స్ వాడుతున్న వారు ఎవరెవరు? వారికి ఎవరు, ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు? అంటూ ప్రశ్నల పరంపర సంధించినట్లుగా సమాచారం. అలాగే సుబ్బరాజుకు చూపించిన వీడియోలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏదో తీసుకుంటుండగా… అతని పక్కనే కూర్చున్న సన్నివేశం చూసిన సుబ్బరాజు బుక్కైపోయానని అర్థం చేసుకుని వివరాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

దీంతో తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా సుబ్బరాజు బీపీ ఒక్కసారిగా డౌన్‌ అయింది. దీంతో ఉస్మానియా వైద్య బృందంతో వైద్య పరీక్షలు చేయించారు. విచారణకు కొంత బ్రేక్‌ ఇచ్చి, డాక్టర్లు ఓకే అన్న తర్వాత మరోమారు ప్రశ్నించారు. దీంతో సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న డ్రగ్స్ పై సుబ్బరాజు పలు కీలక వివరాలు వెల్లడించాడని, సుదీర్ఘ కాలంగా సినీ పరిశ్రమలో ఉంటున్న కుటుంబానికి సంబంధించిన డ్రగ్స్ వినియోగం వివరాలు సుబ్బరాజు వారికి అందజేయడం విశేషం. దీంతో సోమవారం నాడు సదరు కుటుంబానికి చెందిన వ్యక్తులకు కూడా నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories