
ఇందులో భాగంగా సుమన్ జైలుకు వెళ్లిన విషయంలో అప్పట్లో టాలీవుడ్ లో హల్చల్ చేసిన విషయాన్నే ప్రశ్నించింది. “బ్లూ ఫిల్మ్ కేసులో సుమన్ ను ఇరికించింది చిరంజీవేనని, ఇప్పటికీ ఆ ప్రచారం పెద్ద ఎత్తున ఉందని, దీనిని మీరు కూడా నమ్ముతున్నారా?” అన్న ప్రశ్న వేయడంతో కార్యక్రమమంతా ఆసక్తికరంగా మారింది. అలాగే ‘మీ వద్ద ఎంత నల్లధనం ఉంది’ అనే వర్తమాన ప్రశ్నలతో కూడిన ప్రోమో ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది.
అలాగే “గూండాస్ యాక్ట్ వేసిన కారణం ఏంటంటే, వన్ ఇయర్ బెయిల్ లేకుండా, వన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో శిక్షను అనుభవించాలని, నేను బయటకు రాకూడదని వాళ్లు ట్రై చేశారు” అని సుమన్ చెప్పిన సమాధానాలను కూడా చూపించడంతో… ఇంతకీ ఆ “వాళ్ళు” ఎవరన్నది తెలియాల్సి ఉంది. మరి పూర్తి కార్యక్రమంలో ఆదివారం నాడు సాయంత్రం 9.30 నిముషాలకు ప్రసారమయ్యే కార్యక్రమంలో రివీల్ చేస్తారో లేక అలాగే సస్పెన్స్ గా ఉంచుతారో చూడాలి.
Did the failure of Alia Bhatt’s Alpha end up affecting other female actors too? Taapsee…
The former chief minister of Andhra Pradesh YS Jagan appears to have collectively decided that…