“అరవింద సమేత వీరరాఘవ” సినిమాతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్న జూనియర్ ఎన్టీఆర్ కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రిలీజైన నాటి నుండి ప్రశంసల వర్షం కురుస్తుండగా, ఆ జాబితాలోకి అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ కూడా చేరారు. అయితే ఈ హీరో చెప్పిన ‘పిలుపు’లో ఓ ప్రత్యేకత ఉంది.
[m9ad]
వయసుతో నిమిత్తం లేకుండా జూనియర్ ఎన్టీఆర్ ను ఇండస్ట్రీ జనాలు ఎక్కువగా ‘అన్న’ అని సంభోదిస్తుంటారు. కానీ సుమంత్ మాత్రం ముద్దుగా ‘బావ’ అంటూ పిలిచారు. ‘అరవింద సమేత’కు వస్తున్న స్పందనకు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ…. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్స్ చేయగా, వాటికి రిప్లై ఇస్తూ ‘అభినందనలు బావ’ అంటూ తెలిపారు సుమంత్.
ఈ తరం హీరోల నడుమ ఎంతటి సత్సంబంధాలు ఉన్నాయో నిదర్శనంగా దీనిని పేర్కొనవచ్చు. అందరూ కలిసి ఉంటూ అభిమానులకు ఎంతటి పిలుపునిస్తున్నా… వారు మాత్రం ఏకతాటిపైకి రాకపోతుండడం విచారించదగ్గ విషయం. ప్రతి అగ్ర హీరో సినిమా రిలీజైన టైంలో ఇతర హీరోల అభిమానులు విమర్శలతో ట్రోల్ చేస్తుండడం ఏ మాత్రం ఆహ్వానించదగ్గ విషయం కాదు.



