‘ఎన్టీఆర్’ నే కాదు, ‘ఏఎన్నార్’ను కూడా దింపేసారు!

Sumanth as ANR in NTR Biopic“ఎన్టీఆర్” బయోపిక్ పోస్టర్లను ఇప్పటివరకు ‘ఔరా’ అన్న హావభావాలే సర్వత్రా వ్యక్తమయ్యాయి. బాలకృష్ణలో ఎన్టీఆర్ ను, రానాలో చంద్రబాబు నాయుడులను దిగ్విజయంగా చూపించిన దర్శకుడు, తాజాగా సుమంత్ లో ఏఎన్నార్ ను అత్యద్భుతంగా ప్రజెంట్ చేసారు. ఏఎన్నార్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ఈ పోస్టర్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది.

ADVERTISEMENT

[m9ad]

ఇందులో సుమంత్ కాకుండా ఏఎన్నారే కనిపిస్తున్నారని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఒక రకంగా ఆశ్చర్యకరంగా కూడా ఉంది. ఈ పోస్టర్ల వెల్లువ చూస్తుంటే, ఈ సినిమా విడుదల తర్వాత క్రిష్ క్రేజ్ రెండింతలు అవుతుందన్న నమ్మకాలు కలిగిస్తున్నాయి. నానాటికి “ఎన్టీఆర్” బయోపిక్ మూవీ ఎక్కడలేని క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. అందరూ ముక్తకంఠంతో… ‘క్రిష్… నువ్వు మామూలోడు కాదయ్యా…’ అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories