‘సర్ధార్’ సినిమా అసలు ‘హీరోయిన్’ తొలి ‘టీజర్’ టాక్!

sundeep-kishan-run-trailer-talkపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపించినా, చిత్ర యూనిట్ మాత్రం తొలుత అధికారికంగా డిక్లేర్ చేసిన పేరు అనీషా అంబ్రోస్. అయితే కాలక్రమేణా, ఈ పేరు కూడా వెనక్కి వెళ్లి కాజల్ అగర్వాల్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పవన్ సరసన అవకాశం వచ్చిందన్న ప్రచారంతో అనీషా అంబ్రోస్ పేరుకు విపరీతమైన పబ్లిసిటీ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ నటించిన తొలి సినిమా “రన్” టీజర్ విడుదలైంది.

సందీప్ కిషన్ హీరోగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అనిల్ కన్నెగంటి దర్శకుడు. డార్క్ క్రైమ్ కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపధ్యంలో వస్తున్న ఈ సినిమా పరిచయ పాత్రల టీజర్ వీక్షకులను ఆకట్టుకుంది. ‘టైం బాగుంటే అన్ని బాగుంటాయి, అదే సమయం కలిసి రాకపోతే పరిస్థితులు ఎలా మారతాయో అనే కాన్సెప్ట్ తో కూడిన టీజర్ ప్రామిసింగ్ గా ఉంది. సందీప్ కిషన్ లుక్స్ యధావిధిగా బాగానే ఉండగా, సర్దార్ సినిమా అసలు హీరోయిన్ అనీషా అంబ్రోస్ లుక్స్ మాత్రం ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి.

ADVERTISEMENT

ముఖ్యంగా టీజర్ చివర్లో ‘అసలు… నువ్వు ఫేస్ ఎప్పుడు చూసావురా…’ అంటూ అనీషా పలికించిన హావభావాలు యూత్ కు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక, చాలా కాలం నుండి హిట్ కోసం వేచిచూస్తున్న సందీప్ కిషన్ టైం మాత్రం మార్చి 23వ తేదీన తేలబోతుంది. ఆ రోజే ఈ “రన్” సినిమా ధియేటర్లలో ప్రత్యక్షం కానుంది.

ADVERTISEMENT
Latest Stories