అరవింద సమేతలో నిరాశపరిచిన కమెడియన్ సునీల్

sunil dissappoints in aravindha samethaచాల కాలం తరువాత కమెడియన్ గా ‘అరవింద సమేత వీర రాఘవ’ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన సునీల్, ప్రేక్షకుల అంచలనాలను అందుకోలేక పోయారు. ఈ సినిమాతో ఫుల్ టైం కమెడియన్ గా సునీల్ తన కెరీర్ ని రీస్టార్ట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే.

ADVERTISEMENT

[m9ad]

త్రివిక్రమ్-సునీల్ కాంబినేషన్, పైగా చాల రోజుల తరువాత కమెడియన్ గా సునీల్ రీఎంట్రీ కావడంతో అభిమానుల్లో అంచనా పెరిగింది. కానీ, ఊహించని విధంగా అరవింద సమేతలో సునీల్ క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. నిజానికి, అరవింద సమేత లో ఎంటర్టైన్మెంట్ ట్రాక్ కనిపించడమే అరుదు. దర్శకుడు త్రివిక్రమ్, కమర్షియల్ ఆక్షన్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దే క్రమంలో తన మార్క్ కామెడీని మిస్ అయ్యారనే చెప్పుకోవాలని.

అయినప్పటికీ, సునీల్ మునుపటి లుక్ ని చూసి ప్రేక్షకులు రిఫ్రెష్ అవుతారని యూ.స్ లో ప్రీమియర్ చుసిన అభిమానులు తెలిపారు. అరవిందలో కామెడీ కి స్కోప్ లేకపోయినా ఇకపై సునీల్ కామెడీ పాత్రలపై ద్రుష్టి సారిస్తారని, తన రీఎంట్రీ ద్వారా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories