కామెడీ హీరో సునీల్ తాజాగా నటిస్తున్న చిత్రం “ఈడు గోల్డ్ ఎహే.” ‘బిందాస్, రగడ’ చిత్రాల తర్వాత వీరూ పొట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సునీల్ రెండు ముఖాలు గల ఈ పోస్టర్ పక్కా కాపీ అంటూ సోషల్ మీడియాలో ఆధారాలతో సహా బయట పెట్టారు.
మలయాళ నటుడు మోహన్ లాల్ కు సంబంధించిన పోస్టర్ ను “ఈడు గోల్డ్ ఎహే” చిత్ర దర్శకుడు కాపీ కొట్టారని దీని సారాంశం. రెండూ పోస్టర్ల బ్యాక్ గ్రౌండ్ డిజైన్ మినహాయిస్తే, మోహన్ లాల్ మాదిరిగానే సునీల్ కూడా దర్శనమిచ్చాడు. కాపీ అనేది మామూలుగా మారిన తరుణంలో సునీల్ పోస్టర్ పెద్దగా చర్చలకు దారి తీయకపోవచ్చు.
ADVERTISEMENT





