సునీల్ హీరోగా రూపుదిద్దుకున్న “కృష్ణాష్టమి” సినిమా ఈ వారం 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాత కావడంతో ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా లోటు జరగకుండా చూసుకుంటున్నాడు. ఈ సినిమా గురించి ఇటీవల దిల్ రాజు చేసిన ప్రకటనలు సినిమాపై కాస్త గందరగోళాన్ని సృష్టించాయి.
ఒక హీరో ఇవ్వాల్సిన రేంజ్ లో మైక్ పట్టుకుని ప్రసంగించిన దిల్ రాజు, “ఈ సినిమా షూటింగ్ అయిపోయిన నాటికి మొత్తం నిడివి 2 గంటల 50 నిముషాలు వచ్చిందని, దానిని 2 గంటల 15 నిముషాలకు తగ్గించాలని తానూ, ఎడిటర్ గౌతంరాజు గారు కూర్చొన్నామని, చివరకు 2.09 గంటలకు చేరితే, మళ్ళీ దానిని 2.15కు పెంచామని, అయితే సినిమా చివరి కాపీ సిద్ధమవుతున్న సమయంలో టెక్నికల్ డిపార్టుమెంటుకు చెందిన పప్పు అనే వ్యక్తీ ప్రీ క్లైమాక్స్ కు ముందు ఎంటర్టైన్మెంట్ కు అవకాశం ఉందని చెప్పడంతో మళ్ళీ ఒక రోజు షూటింగ్ చేసి దాదాపు 9 నిముషాల నిడివి ఎపిసోడ్ ను చిత్రీకరించామని దిల్ రాజు చెప్పారు.
అయితే ఆ 9 నిముషాలను మళ్ళీ 4.30 నిముషాలకు కుదించి, సినిమా మొత్తాన్ని 2 గంటల 19 నిముషాలకు తీసుకువచ్చామని, చివర్లో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుందని దిల్ రాజు అభిప్రాయ పడ్డారు. ఇంత వివరంగా సినిమా నిడివి గురించి చెప్పడం దేనికి సంకేతాలు? అంటూ నెటిజన్లు కొత్త చర్చకు దారితీసారు. బహుశా 19వ తేదీన విడుదల కానున్న “కృష్ణాష్టమి” దీనికి జవాబు చెప్పవచ్చు.



