
వైస్ జగన్ మోహన్ రెడ్డి కి వచ్చిన ఈ పదవి గండానికి తన సొంత చెల్లెల్లు కూడా ఒక కారణమే చెప్పాలి. వివేకా గుండె పోటుతో సాక్షిలో మొదలైన ఈ జగన్నాటకం చివరికి సొంత చెల్లెళ్ళ మీద అసభ్యకర పోస్టులతో వైసీపీ సోషల్ మీడియాలో ముగిసిందా అన్నట్లుగా పరిస్థితులన్నీ జగన్ కు వ్యతిరేకంగా మారిపోతున్నాయి.
అయితే ఇందులో అప్పుడు జగన్ ఆడిన రాజకీయ చరంగంలో పావులుగా మారిన చెల్లెల్లు సునీత, షర్మిల జగన్ విజయానికి పాటుపడితే ఇప్పుడు జగన్ ఆడిస్తున్న వికృత క్రీడలో వైసీపీ పాలిట యమకింకరులుగా మారిపోయారు. గత కొన్ని రోజుల నుండి ఏపీలో జరుగుతున్న “స్వచ్ఛ సోషల్ మీడియా” కార్యక్రమానికి షర్మిల మద్దతుతో పాటుగా సునీత సహకారం కూడా తోడయ్యింది.
దీనికి సంబంధించి ఇప్పటికే జగన్ సొంత చెల్లి వైస్ షర్మిల కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైసీపీ సోషల్ మీడియా తన పైన తన కుటుంబ సభ్యుల పైన, తన తల్లి విజయలక్ష్మి మీద చేసిన అసభ్యకర పోస్టులను బయటపెట్టి తానూ వైసీపీ బాధితురాలని అంటూ ఇటువంటి సైకోలను, ఈ సైకోలను పెంచి పోషిస్తున్న వైసీపీ పార్టీ మీద చాల ఘాటైన విమర్శలు గుప్పించారు.
అగ్నికి ఆజ్యం తోడయినట్టు ఇప్పుడు వైసీపీ మీద షర్మిల చేసిన విమర్శలకు సునీత తీసుకున్న చర్యలు వైసీపీ పాలిట గండంగా మారిపోయాయి. తన పైన తన కుటుంబం పైన అవినాష్ రెడ్డి అనుచరుడిగా చెలామణి అవుతున్న వర్రా రవీంద్రా రెడ్డి చేసిన అసభ్యకర పోస్టులకు గాను ఆయన మీద ఫిర్యాదు చేయడానికి పులివెందుల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు సునీత.
ఈ నేపథ్యంలో వర్రా రవీంద్రా రెడ్డి మీద అధికారులు పెట్టిన కేసులు ఇంకాస్త బలపడే అవకాశం లేకపోలేదు. అలాగే వర్రా రెడ్డి వీరంగం వెనుక ఉన్న ఆ రహస్య శక్తులెవ్వరన్నది బయట ప్రపంచానికి తెలియాలి. ఇప్పటికే తన తండ్రి హత్యకు అవినాష్ రెడ్డి కారణమంటూ సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఈ వైసీపీ సోషల్ మీడియా వికృతాల మీద పోలీసులను ఆశ్రయించారు.
దీనితో సొంత కుటుంబలోని మహిళల మీదే ఇటువంటి నీచమైన పోస్టులు చేపిస్తున్న వైస్ జగన్ సమాజం ముందు దోషిగా నిలబడక తప్పని పరిస్థితి ఎదురయ్యింది. అదీకాక ఇటువంటి వారికి మద్దతుగా పార్టీ నిలబడుతుంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీ పతనానికి మరో అస్త్రం గా మారింది.
సొంత కుటుంబ సభ్యులనే వదలని జగన్ రాజకీయం ఇక సగటు సామాన్య మహిళను విడిచి పెడుతుందా.? నా అక్క చెల్లెల్లు అంటూ జగన్ చేసే వ్యాఖ్యలు కేవలం రాజకీయ లబ్ది కోసమేనని, ఇంట్లో ఉన్న చెల్లెళ్లను ఏడిపించి బయట ఉన్న మహిళలకు జగన్ మేలు చేస్తాడంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా అంటూ వైసీపీ రాజకీయం మీద, జగన్ మానవత్వం మీద రాష్ట్రంలో చర్చ జరుగుతుంది.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…