సన్నీలియోన్ గురించి కొత్తగా చెప్పడానికేముంది… ఇయర్ ఎండింగ్ లో గూగుల్ తల్లే స్పష్టంగా చెప్తుంది… ఈ ఏడాదిలో సెర్చ్ చేసిన జాబితాలో సన్నీలియోన్ మొదటి స్థానంలో ఉందని! ఇలా గడిచిన కొన్ని సంవత్సరాలుగా యువ హృదయాలను కొల్లగొడుతోన్న సన్నీలియోన్, బాలీవుడ్ లో డబుల్ మీనింగ్ సినిమాలలో మరియు మరికొన్ని హాట్ మూవీస్ ను చేసింది. తెలుగు తెరపై కూడా అప్పుడప్పుడు దర్శనమిస్తూనే ఉంది.
ఇలా ‘హాట్’ ముద్ర వేయించుకున్న సన్నీలియోన్ తాజాగా “వీరమహాదేవి”గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేసారు. మొత్తం ఫోటోషాప్ ను వినియోగించి చేసినట్లుగా కనపడుతోన్న ఈ పిక్ లో నాణ్యతా లోపం స్పష్టంగా కనపడుతోంది. ఇప్పటివరకు అందాల ఆరబోత చేసిన ఈ ముద్దుగుమ్మను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు ఎంతవరకు స్వీకరిస్తారో అన్నది ప్రశ్నార్ధకం.
ADVERTISEMENT
ADVERTISEMENT



