రాజకీయాలు వద్దనుకున్నా…ప్రజసేవ కాదు…!

Rajinikanth-Chandrababu-naidu-arrest

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం చేసిన కొద్దీ రోజులకే తన వయస్సు రీత్యా అది సాధ్యంకాదని భావించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనితో ఆయన రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూసిన, చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులు ఒక్కసారిగా నైరాశ్యాలోకి వెళ్లిపోయారు.

అయితే రాజకీయాలలోకి వచ్చేది ప్రజాసేవ చేయడానికే అయినప్పుడు….అది ఎలా అయినా చేయవచ్చని నిరూపించే ప్రయత్నం మొదలుపెడుతున్నారు రజని కాంత్. ఇండస్ట్రీ తనకు చాలానే ఇచ్చింది కాబట్టి దానిలో కొంతయినా తిరిగి సమాజానికి వినియోగిస్తే చాలు అని ఎంతోమంది సెలబ్రేటిస్ ముందుకొస్తుంటారు.

ADVERTISEMENT

అందులో మెగాస్టార్ చిరు ముందు వరుసలో ఉంటారనే చెప్పాలి. సినిమాల నుంచి తానూ పొందిన అభిమానం, ఆదాయంలో కొంతభాగం బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు…ఇలా కొన్ని సేవ కార్యక్రమాల ద్వారా సమాజానికి, పేదవారికి తనవంతు సాయం అందిస్తుంటారు చిరు. అలాగే ప్రిన్స్ మహేష్ బాబు…ఇలా ఎవరికీ వారు స్వచ్చందంగా తమవంతు తిరిగి ఇస్తుంటారు.

ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదేతరహా సేవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. పేదలకు ఉచిత వైద్య సదుపాయాలు అందించడానికి చెన్నై సమీపంలో ఒక భారీ ఆసుపత్రిని నిర్మించబోతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపారు.

ఇందుకోసమే తిరుప్పూపూర్ అనే ప్రాంతంలో సుమారు 12 ఎకరాల స్థలాన్ని రజని కొనుగోలు చేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. త్వరలోనే భూమి పూజ చేసి ఈ వార్త పై అధికారిక ప్రకటన విడుదల చేబోతున్నారని అధికారిక సమాచారం. అయితే మొదటి నుంచి ఎంతో సింపుల్ గా లైఫ్ లీడ్ చేసే రజనీకాంత్ ఇటువంటి ప్రచార ఆర్భాటాల కోసం పాకులాడకుండా తాను చేయదలచుకున్న పనిని చేసుకు పోతుంటారని ఆయన అభిమానులు రజని పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

రాజకీయాలకు దూరమైనా ఇటువంటి సేవ కార్యక్రమాలకు సూపర్ స్టార్ ఎప్పటికి దూరం కాబోరని, ఆయన ‘రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్’ లో కూడా సూపర్ స్టారే అంటూ కొనియాడుతున్నారు సూపర్ స్టార్ ఫాన్స్.

ADVERTISEMENT
Latest Stories