Telugu

ఇదెక్కడి మాస్ రా అయ్యా..?

రోహిత్, విరాట్, జడేజాల వంటి అంతర్జాతీయ దిగ్గజాలు పొట్టి ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాక, భారత జట్టు ఆడిన మొదటి టీ-20 సిరీస్ నిన్నటితో ముగిసింది. కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యలు తమ మార్క్ చూపించారు అనటంలో ఎటువంటి సంకోచం లేదు. అన్ని రంగాల్లోనూ అనుభవ కొరత కనిపిస్తున్న ఇప్పటి యువ భారత టీ-20 జట్టు తో శ్రీలంక వెళ్లి శ్రీలంకను చిత్తు చేసింది “సూర్య సేన”. 3-0 తో భారత్ ఈ సిరీస్ ను కైవసం చేసుకుంది.

కోచ్ గా పగ్గాలు చేపట్టటమే ఆలస్యం, గంభీర్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యారు. తాను ఆటగాడిగా ఉన్న సమయం నుండే కాస్త దూకుడుతనం తో ఉండే గంభీర్, కోచ్ గా మారాక జాతీయ జట్టు కు ఏ మేరకు తన అనుభవాన్ని అందిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు. అయితే ఈ సిరీస్ లో భారత జట్టు ఎన్నో అవాక్కుపడే పనులని చేసింది.

ADVERTISEMENT

కేవలం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా టీమ్ లో కి ఎంట్రీ ఇచ్చిన రియాన్ పరాగ్ కు మొదటి టి-20 లో కెప్టెన్ సూర్య బౌలింగ్ లో అవకాశం ఇచ్చారు, దీన్ని పూర్తిగా వినియోగించుకున్న రియాన్ ఆరోజు 3 వికెట్లతో పండగ చేసుకున్నాడు. జరిగిన మూడు మ్యాచ్లలోనూ భారత జట్టుకు విజయం అంత సులువుగా రాలేదు. మొత్తం మూడు మ్యాచ్ల లో శ్రీలంక విజయ తీరాల వరకు వచ్చారు. మన బౌలర్లకు మొదట వికెట్లు పడుకున్నా, ప్రతి మ్యాచ్ లోనూ డెత్ ఓవర్లలో లంక బ్యాట్స్ మెన్ కు కంటి మీద కునుకు లేకుండా చేసారు.

మొదటి టి-20 లో, తొలుత బాటింగ్ చేసిన ఇండియా 213 పరుగులు చేసినప్పటికీ, లంక టాప్ ఆర్డర్ బాట్స్మన్ చేసింగ్ లో సెరవేగంగా లక్ష్యం దిశగా వచ్చారు. 14 ఓవర్లు ముగిసేసరికి 140 పరుగులు చేసి, విజయానికి మరెంతో దూరం లేదనుకునే సమయం లో ఓపెనర్ నిస్సంక వెనుదిరిగాడు, ఇక లంక బాట్స్మన్ పేక మేడ కూలినట్టు ఒకొక్కరిగా వెనుదిరిగారు. 170 పరుగులకు అల్ అవుట్ అయ్యారు. చివరి 6 ఓవర్లలో 9 వికెట్లు సమర్పించుకున్నారు.

ఇక రెండవ మ్యాచ్ లో తొలుత బాటింగ్ కు వచ్చారు లంక, 15 ఓవర్లు ముగిసేసరికి 130 పరుగులు చేసి కేవలం 2 వికెట్లు కోల్పోయారు. మంచి స్కోర్ దిశగా వెళ్తున్నారు అనుకునేలోపే, ఆ జట్టు బాట్స్మన్ మళ్ళీ చేతులెత్తేశారు. కేవలం 161 పరుగులకే పరిమితమయ్యారు. చేసింగ్ లో వర్షం కారణంగా మ్యాచ్ 8 ఓవర్లకు కుదింపబడగా, 78 పరుగుల లక్ష్యం తో వచ్చిన భారత్,కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, సిరీస్ ను ఇంకా ఒక మ్యాచ్ మిగులుండగానే చేజిక్కించుకున్నారు. అయితే భారత జట్టు తాజాగా ముగిసిన మూడవ మ్యాచ్ లో గెలిచిన తీరు అమోఘం.

తొలుత బాటింగ్ చేసిన భారత బాట్స్మెన్ కేవలం 137 పరుగులు మాత్రమే చేయగలిగారు. లక్ష్య ఛేదన కు వచ్చిన లంక ఓపెనర్ల ఉద్దేశం కేవలం వికెట్లు పడకుండా నెమ్మదిగా లక్ష్యం వైపు చేరడం. వారు దానిని ఆచరించటం లో సఫలం అయ్యారు కూడా. 15 ఓవర్లు ముగిసే సరికి 108 పరుగులు చేసి కేవలం 1 వికెట్ కోల్పోయారు. చివరి 30 బంతుల్లో 30 పరుగులే చెయ్యాల్సిన పరిస్థితి, చేతిలో 9 వికెట్లు, లంక గెలుపు నిశ్చయం అని టీవీ కట్టేసిన వారెందరో ఉన్నారు. అయితే భారత బౌలర్లు అప్పుడు యధావిధిగా డెత్ ఓవర్లలో వికెట్ల పండగ చేసుకున్నారు. బిష్ణోయ్ కు 1, సుందర్ కు 2, రింకు కు 2, సూర్య కు 2 వికెట్లు దక్కాయి.

చివరి రెండు ఓవర్లలో 12 బంతులకు 9 పరుగుల లక్ష్యం తో ఉన్న లంక ఓటమి పాలవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. అపుడు కెప్టెన్ సూర్య అనూహ్యంగా మెయిన్ బౌలర్ సిరాజ్ ను కాదని ‘రింకు’ కు బాల్ అందించాడు, రింకు 2 వికెట్లు తీసి కేవలం 3 పరుగులను సమర్పించాడు. అయితే అత్యంత కీలక చివరి ఓవర్ లో కెప్టెన్ సూర్య తనకు తానే బౌలింగ్ లో కి ప్రవేశింపజేసుకుని, కేవలం 5 పరుగులు సమర్పించి 2 వికెట్లు తీసుకుని మ్యాచ్ ను “టై” చేసారు.

సూపర్ ఓవర్ లో తొలుత బాటింగ్ చేసిన లంక కేవలం 2 పరులు చేసారు, ఛేదన లో సూర్య మొదటి బంతికే మ్యాచ్ ను ముగించారు. ఇలా “గంభీర్-సూర్య” పర్వానికి ఎటువంటి ఆరంభం కావాలని అభిమానులు కలలు కన్నారో, అలాగే వారు సిరీస్ ను అందుకున్నారు. అయితే నిన్న రాత్రి కెప్టెన్ చేసిన బౌలింగ్ చేంజెస్ ను వర్ణిస్తూ సోషల్ మీడియా లో అంభిమానులు “ఇదెక్కడి మాస్ రా మావా” అంటూ వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చూడాలి మరి సూర్య-గంభీర్ ల జోడి భవిషత్ లో కూడా ఇలాగే ప్రపంచాన్ని అవాక్కు పరిచే ప్లన్స్ తో ఆట లో కి దిగుతారేమో అని..?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

14 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

44 minutes ago