టీజర్ టాక్ – ఒక ఆట ఆడుకునేటట్టే ఉన్నారు!

Sushanth Aatadukundam Raa Telugu Movie Teaser  talkరెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రస్తుతం కాలం చెల్లింది. సాక్షాత్తూ కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా ప్రేక్షకుల చేత నవ్వులు పూయించడంలో విఫలమవుతున్నారు. అలాంటి తరుణంలో మరో శ్రీనువైట్ల మార్క్ మూవీలా “ఆటడుకుందాం రా” టీజర్ కనపడుతోంది.

జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ హీరోగా నటిస్తుండగా, సోనం జంటగా కనపడుతోంది. అక్కినేని కుటుంబం నుండి వచ్చిన సుశాంత్ వెండితెరపై హీరోగా చూడడానికి ప్రేక్షకులు పడ్డ ఇబ్బందిని గమనించి కాస్త వర్కౌట్ చేసినట్లు, జిమ్ బాడీతో స్లిమ్ గా కనపడుతున్నాడు. మునుపటితో పోల్చుకుంటే లుక్ విషయంలో పరవాలేదనిపించగా, మిగతా టీజర్ అంతా రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ సినిమా మాదిరి కనపడుతోంది.

ADVERTISEMENT

అయితే అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుండడం ఒక్కటే ప్రేక్షకులకు కాస్తంత నమ్మకాన్ని కలిగించే అంశం. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీశర్మ, పృధ్వీరాజ్ వంటి ప్రముఖ తారాగణం అంతా నటించి, వెండితెరకు నిండైన రూపాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. విజయం కోసం దండయాత్రలు చేస్తున్న సుశాంత్ కు ఈ “ఆటడుకుందాం రా” అయినా ధియేటర్లలో కొన్నాళ్ళు ఆడుతుందో లేక ప్రేక్షకులతో ఆడుకుంటుందో వేచిచూడాలి.

ADVERTISEMENT
Latest Stories