ఆకాశంలో ‘కింగ్’ నాగార్జున..!

sushanth praises akkineni nagarjuna‘మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి’ సినిమాలతో హ్యట్రిక్ హిట్లు అందుకుని మాంచి జోరుమీదున్న ‘కింగ్’ నాగార్జునను “ఊపిరి” విజయోత్సవ వేడుకలో ఆకాశానికేత్తెసారు. ‘ఊపిరి’ సినిమాకు సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నుండి సుశాంత్ వరకు అందరూ నాగ్ ను పొగడ్తలతో తడిపి ముద్ద చేసారు.

“గీతాంజలి నుంచి ఊపిరి వరకు నాగ్ చేయని జోనర్ లేదని, దిగ్గజ నటులు అక్కినేని నాగేశ్వరరావు తన నట జీవితంలో ఎన్ని ప్రయోగాలు చేశారో, అదే స్థాయిలో ప్రయోగాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని” సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నారు. ‘ఊపిరి’ సినిమా మాతృక ‘ఇన్ టచ్ బుల్స్’ చిత్రాన్ని తాను చూశానని, ‘రీమేక్’లా కాకుండా ‘ఫ్రీమేక్’గా దర్శకుడు వంశీ పైడిపల్లి తీర్చిదిద్దారని కితాబునిచ్చారు. ఇలాంటి కథను తీసేందుకు నిర్మాతకు ఎంతో ధైర్యం కావాలని, అలాంటి తెగువ చూపిన పీవీపీని ఈ సందర్భంగా అభినందించారు.

ADVERTISEMENT

“ఏ సినిమా తీసుకున్నా దానికి తగినట్లుగా ప్రత్యేకంగా ఉండేలా ఉండడం తన మావయ్యకే సాధ్యమైందని, మావయ్య లాంటి వర్సటైల్ యాక్టర్ మరొకరు లేరని, ఇలాంటి నటుడు దొరకడం అదృష్టమని, తన లాంటి యువ నటులకు ఎల్లప్పుడూ స్పూర్తిగా ఉంటాడని, తాతగారి పేరును నిలబెడుతూ, తనదైన శైలిలో రాణించారని, ‘ఊపిరి’ లాంటి సినిమాలో నటించాలంటే ఓ ఇమేజ్ ఉన్న నటుడు ఎవరైనా ఆలోచిస్తారని, కానీ కింగ్ మాత్రం అలాంటి ఆలోచన పెట్టుకోకుండా చేయడం ప్రత్యేకతను తెలియజేస్తుందని” సుశాంత్ తన మావయ్యపై ప్రశంసల జల్లు కురిపించారు.

ADVERTISEMENT
Latest Stories