చావు కబురు చల్లగా చెప్తే ఎలా ఉంటుంది?

YS Jagan Bhuma Nagi reddyవైసీపీ అధినేత జగన్ ప్రస్తుతం అయోమయ పరిస్థితిలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అంటూ రోజుకో పేరు తెర పైకి రావడం – వారిని సమర్దించి, బుజ్జగించే లోపు మరో పేరు ప్రచారంలోకి వస్తుండడంతో పార్టీ భవిష్యత్తు పార్టీ పరిస్థితి ఏమవుతుందో అన్న సమాలోచనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భూమా నాగిరెడ్డి వ్యవహారం జగన్ కు మింగుడు పడని అంశంగా మారినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇప్పటికే తన వైపు నుండి రంగంలోకి దించాల్సిన మహామహులను భూమా నాగిరెడ్డి వద్దకు పంపించి చర్చలు జరిపినా ఫలితం లేదనే కధనాలు వెలువడుతున్నాయి. అలాగని, ఇటు అధికార పార్టీ వారికి కూడా భూమా చేరికపై ఖచ్చితమైన సమాచారం ఉన్నట్లుగా కనపడడం లేదు. ముందుగా టిడిపి వర్గాల్లో వ్యతిరేక పవనాలు వీయగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని తొలగించారు. దీంతో భూమా చేరిక దాదాపుగా ఖరారయ్యిందని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నా ఇప్పటివరకు భూమా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం విశేషం.

ADVERTISEMENT

గత రెండు, మూడు రోజులుగా ప్రచారంలో ఉన్న విషయంపై తాత్సారం వహిస్తున్నారంటే చర్చల దశలో ఉన్నట్లుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో ఇలా వార్తలు వచ్చిన సందర్భంలో మరుసటి రోజే భూమా మీడియా ముఖంగా సదరు వార్తలను ఖండించారు. మరి ఈ సారి అలా కాకుండా ‘ప్రతి సారి వస్తున్న ఈ వార్తలపై తానూ జవాబివ్వలేనని, ఒక్కసారే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ కలుస్తానని చెప్పి రెండు రోజులయ్యింది. ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. దీంతో టిడిపిలోకి భూమా రీ ఎంట్రీకి ముహూర్తం ఖరారయ్యిందని, ఈ నెల 28వ తేదీన పార్టీలో చేరబోతున్నారని మీడియా వర్గాలలో లభిస్తున్న సమాచారం.

మరి చావు కబురు చల్లగా చెప్పినట్లు… ఒక వారం రోజుల పాటు తాత్సారం చేసిన విషయాన్ని జగన్ చెవిన చల్లగా వేస్తారా? అన్న కామెంట్లు వినపడుతున్నాయి. అదే జరిగితే పార్టీకి అండదండలుగా ఉన్న సామాజిక వర్గంతో పాటు, కర్నూల్ జిల్లాలో ఆర్ధికంగా బలపడిన భూమా వర్గం దెబ్బ జగన్ ను కోలుకోనిస్తుందా?

ADVERTISEMENT
Latest Stories