శరవేగంగా సై…సై… సైరా…!

Syeraa Narasimha Reddy movie updatesసురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ శరవేగంగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన తొలి భారతీయుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’గా ఈ సినిమాలో చిరంజీవి కనిపించనుండగా, మెగాస్టార్ కు జతగా నయనతార కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది.

ADVERTISEMENT

[m9ad]

గత కొన్ని రోజులుగా ప్రధాన తారాగణం అంతా పాల్గొన్న కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరణ జరుపుతున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నారు. ఆంగ్లేయ సైన్యంపై నరసింహారెడ్డి… ఆయన అనుచర గణం విరుచుకుపడే పోరాట సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.

సిల్వర్ స్క్రీన్ పైన ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తాయనీ, సినిమాకి హైలైట్ గా నిలుస్తాయనేది ట్రేడ్ టాక్. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తుండగా, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు .. విజయ్ సేతుపతి .. సుదీప్ తదితరులు కనిపించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories