విశాఖ వేదికగా జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో టీమిండియా జయకేతనం ఎగురవేసి సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ విజయం పట్ల విశాఖ వాసులతో పాటు క్రికెట్ ప్రేమికులు కూడా నిరుత్సాహపడ్డారు. విశాఖ వేదికగా పరుగుల వరద పారిస్తారని భావిస్తే, అది కాస్త తుస్సుమనడమే ఈ నిట్టూర్పుకు కారణం.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పుడో అరుదుగా గానీ ‘లైవ్’లో మ్యాచ్ లను చూసే అవకాశం రాదు. దీంతో వచ్చిన అరకొర మ్యాచ్ లలో బ్యాట్స్ మెన్లు భారీ పరుగులతో కనువిందు చేస్తారని ఆశిస్తారు. అందులోనూ రెండవ టీ20 మ్యాచ్ లో దాదాపు 200 పరుగుల దాకా పరుగుల వరద పారించడంతో, విశాఖలోనూ అదే రిపీట్ అవుతుందని భావిస్తే, శ్రీలంక కేవలం 82 పరుగులకే చాపచుట్టేయడం, దానిని టీమిండియా తేలికగానే చేజ్ చేయడంతో మ్యాచ్ చప్పగా సాగిందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అయితే భారత్ కప్ కైవసం ప్రధానం కావడం మరియు ఈ విజయంతో టీమిండియా మరోసారి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకోవడం క్రికెట్ ప్రేమికులకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశాలు. చివరి మ్యాచ్ లో 8 పరులుగులిచ్చి 4 వికెట్లు తీసిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా వశమైంది.





