నేచురల్ స్టార్ నాని, టాక్సీ వాలా చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `శ్యామ్ సింగా రాయ్`. పనిలో పనిగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేస్తామని రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేసింది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈ సినిమాలో నాని బెంగాళీ బాబుగా కనిపించనున్నాడట.
ఇక ఈ సినిమాలో హీరోది డబుల్ రోల్ అని కొందరు, లేదు.. ట్రిపుల్ రోల్ అని మరికొందరు సోషల్ మీడియాలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సినిమా యూనిట్ తెలిపింది. అయితే ఈ సినిమా సాంకేతికవర్గం ఆషామాషీగా ఉండదని అంటున్నారు.
ఇప్పటికే మ్యూజిక్ కోసం ఏఆర్ రెహ్మాన్ తో చర్చలు జరుపుతున్నారు. ఇప్పుడు కెమెరా కోసం దేశంలోనే ఒకానొక టాప్ కెమెరామన్ నిరవ్ షా తో మాట్లాడుతున్నారట. నిరవ్ షా ఎన్నో బాలీవుడ్ కోలీవుడ్ పెద్ద సినిమాలకు పని చేశారు. ప్రస్తుతం విశాల్ డిటెక్టీవ్ 2 కి పని చేస్తున్నారు. తెలుగులో ఆయన ఇదివరలో సిద్ధార్థ లవ్ ఫెయిల్యూర్, అనుష్క సైజు జీరో కు పని చేశారు.
ప్రస్తుతం నాని నటించిన ‘వి’ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. నాని ప్రస్తుతం టక్ జగదీష్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రం జులైలో పూర్తి అవుతుంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాకా శ్యామ్ సింగా రాయ్ షూటింగ్ మొదలు పెడతాడు. మొత్తానికి నాని వచ్చే ఏడాది ఏడాదిన్నర వరకూ ఫుల్ బిజీగా ఉండదు.





