కింగ్ నాగార్జున – తమిళ హీరో కార్తి కాంభినేషన్ లో మల్టీస్టారర్ సినిమాగా రూపుదిద్దుకున్న “ఊపిరి” ఆడియో వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. అయితే ఈ ఆడియో ఈవెంట్ లో మిల్కీ బ్యూటీ తమన్నాను వీక్షించాలని భావించిన వారికి మాత్రం పూర్తి నిరాశే ఎదురయ్యింది.
ADVERTISEMENT
ఇటీవల జరిగిన తమిళ వర్షన్ ఆడియో వేడుకలో ఎరుపు రంగు డ్రస్ లో మెరిసిపోయిన ‘మిల్కీ బ్యూటీ,’ ఈ ఈవెంట్ లో ఎలాంటి కాస్ట్యూమ్స్ లో దర్శనమిస్తుందోనని ఎదురు చూసిన తమన్నా అభిమానులకు చేదు వార్తను అందించింది. తను “ధర్మదూరై” షూటింగ్ లో ఉన్నానని, ఆడియో వేడుకను మిస్ అవుతున్నానని, షూటింగ్ లో ఉన్నా నా మనసంతా ఆడియో వేడుకలోనే ఉంటుందని, సినిమాలోని పాటలు ప్రేక్షకుల మనసును తాకుతాయంటూ చెప్పుకొచ్చింది తమన్నా.
ADVERTISEMENT



