సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి ఈ సినిమా విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దానితో బ్రేక్ అనేది లేకుండా షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొట్టమొదటి సారిగా రష్మిక మందన్న నటిస్తుంది. ఈ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్తుంది. ఇది ఇలా ఉండగా సినిమాకు మరింత గ్లామర్ కావాలని అనుకున్నాడో ఏమో అనిల్ రావిపూడి ఈ చిత్రం కోసం మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ని తీసుకుని వచ్చాడు.
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా మొదట్లో వచ్చే ఇంట్రడక్షన్ సాంగ్ లో కనిపిస్తుంది. మహేష్ బాబు చేత మరీ మాస్ స్టెప్స్ వేయించలేరు. పైగా ఆర్మీ అధికారి. అందుకే పాటలో తమన్నాను తీసుకున్నారు. గ్లామర్ పని ఈ అమ్మడు చూసుకుంటుంది. తమన్నా ఇప్పటికే రెండు మూడు స్పెషల్ సాంగ్స్ చేసింది. అన్ని సాంగ్స్ హిట్ నే. అందుకే సరిలేరు నీకెవ్వరులో తమన్నాకు ఆ చాన్స్ వచ్చింది. ఇది వరలో మహేష్ బాబు తమన్నా కలిసి ఆగడు సినిమాలో నటించారు.
ఒకానొక దశలో తమన్నానా? శృతి హాసన్ నా? అన్న డిస్కషన్ వచ్చినపుడు తమన్నానే ఫైనల్ చేశారు. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. చాలా కాలం తరువాత బండ్ల గణేష్ కూడా నటిస్తున్నారు. బండ్ల గణేష్ చివరి సారిగా 2012లో విడుదలైన బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. అది కూడా మహేష్ బాబు సినిమానే కావడం విశేషం.





