
“బాహుబలి” సినిమాలో నటించాక పాత్రల విషయంలో ప్రయోగాలు చేసే అవకాశం దక్కిందని, అదే ‘అభినేత్రి’కి కారణమని పేర్కొంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం కంటే మూడు భాషల్లో ఒక దాని తర్వాత ఒక భాషలో డైలాగ్స్ చెప్పడమే కష్టమనిపించిందని తెలిపింది. ఒకేసారి మూడు భాషల్లో సినిమా చెయ్యడం చాలా కష్టమని చెప్పుకొచ్చింది. మూడు వెర్షన్ల కోసం డైలాగ్స్ చెప్పడం, డ్యాన్సుల్లో ఆయా భాషలకు తగ్గట్టుగా పెదాల కదిలిక ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా కష్టమని వివరించింది.
ఆ సమయంలో తాను ఎంత బాధ అనుభవించిందీ తనకు మాత్రమే తెలుసని పేర్కొంది. నిజానికి మూడు భాషల్లో చెయ్యాలనే ‘బ్యాడ్ ఐడియా’ ఇచ్చింది తానేనని తెలిపింది. మొదట తమిళం, హిందీలోనే ఈ సినిమాను చెయ్యాలని అనుకున్నారని, కానీ తెలుగులోనూ మార్కెట్ ఉంటుందన్న తన సలహాతో ‘అభినేత్రి’ త్రిభాషా చిత్రంగా రూపుదిద్దుకుందని వివరించిందీ ఈ మిల్కీ బ్యూటీ.
An early premiere can bring a film international attention even before its theatrical release. But…
Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…