సామాన్య ప్రేక్షకులలో హీరోయిన్ల పట్ల ఎంత క్రేజ్ ఉంటుందో మరోసారి అనంతపురం వేదికగా బయటపడింది. 178వ మలబార్ స్టోర్ ను ఓపెన్ చేయడానికి అనంతపురం విచ్చేసిన ‘మిల్కీ బ్యూటీ’ తమన్నాను చూడడానికి అభిమానగణం పోటెత్తింది. ఈ జన ప్రవాహానికి ఫిదా అయిన తమన్నా, వీరందరూ కవర్ అయ్యే విధంగా ఓ సెల్ఫీను తీసుకుని అభిమానులను మరింత ఉత్సాహపరిచింది.
‘బాహుబలి’ పార్ట్ 1 తర్వాత ట్రేడ్ వర్గాలలోనే కాదు, సగటు సినీ ప్రేక్షకులలో కూడా తమన్నా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకు నిదర్శనంగానే అనంతపురం ప్రేక్షకులు ఈ సౌందర్య రాశిని ప్రత్యక్షంగా చూడాలని కదిలివచ్చినట్లుగా కనపడుతోంది. అల్లంత దూరాన ఉండే ముగ్ధమనోహరమైన సౌందర్యం, తమ చెంతకు వస్తే వీక్షించాలని ఎవరికీ మాత్రం ఉండదు… అనంతపురం ప్రేక్షకులు కూడా అదే చేసారు..!
ADVERTISEMENT
ADVERTISEMENT



