చిరంజీవి పాలిటిక్స్ కు పనికి రాడని అప్పుడే చెప్పా!

Tamma reddy chiranjeevi commentsసంచలనాల దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజకు – మెగాస్టార్ చిరంజీవికి ఉన్న సాన్నిహిత్య సంబంధం అందరికీ తెలిసినది కాదు. ఇండస్ట్రీలో వర్గాల వరకే పరిమితమైన ఈ సమాచారం తమ్మారెడ్డి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చిరుతో తనకున్న సంబంధాన్ని బయటపెట్టారు. “మద్రాస్ లో ఉన్నపుడు చిరంజీవి తానూ ఎంతో కలిసిమెలిసి ఉన్న మాట వాస్తవమేనని, సొంత అన్నదమ్ముల మాదిరి మెలిగామని, అతను తన ఆఫీసుకు వస్తుండేవాడని, అలాగే తానూ చిరంజీవి రూంకు వెళ్ళేవాడిని అన్నారు. ఆ తర్వాత ఆర్ధిక ఇబ్బందులతో తనూ హైదరాబాద్ కు వచ్చి ఉద్యోగంలో చేరిన తర్వాత మళ్ళీ సినీ నిర్మాణం చేపట్టడానికి మరో అయిదారేళ్ళు సమయం పట్టిందని, అలా గ్యాప్ వచ్చిందని, అయితే ఎప్పుడు కనపడ్డా ప్రేమగానే పలకరిస్తాడని, అయితే ఒక ఇమేజ్ వచ్చిన ఆర్టిస్ట్ కు ఆ పాత ప్రేమలు ఉండడం కష్టమేనని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

ఇటీవల కాలంలో చిరును టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నరనడం అవాస్తవమని, చిరు – తానూ అతి కొద్ది సందర్భాలలో మాత్రమే కలుసుకుంటామని, అందుకే మీడియా వేదికగా నా అభిప్రాయాలు వ్యక్తపరిచేవాడినని, ఒకప్పుడు నా ఆఫీసుకు వచ్చిన చిరంజీవి దగ్గరకు వెళ్ళడానికి తన ‘ఈగో’ కూడా అడ్డు వస్తుందని, అయితే ఏ అభిప్రాయాలు చెప్పినా అవి తనపై ఉన్న కోపంతో కాదని, శ్రేయోభిలాషుడిగా మాత్రమేనని అన్నారు. అయితే రాజకీయంగా మాత్రం చిరంజీవికి పూర్తి వ్యతిరేకమని కుండబద్దలు కొట్టారు.

ADVERTISEMENT

చిరంజీవి రాజకీయాలకు పనికి రాడన్న విషయాన్ని “ప్రజారాజ్యం” పార్టీ స్థాపించే ముందే చెప్పానని, అది ప్రస్తుతం రుజువయ్యింది కదా… నేనేం తప్పు కాదు కదా… అంటూ ఓ ‘చిరు’నవ్వు చిందించారు. చిరుతో నాకున్న సాన్నిహిత్యం రీత్యా మాత్రమే చెప్పగలిగానని… అయితే తన వ్యాఖ్యలను బహుశా చిరంజీవి కూడా ఎప్పుడూ సీరియస్ గా తీసుకుని ఉండకపోవచ్చని, ‘అన్నయ్య’ ఎప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటాడు అని అనుకుని ఉండవచ్చని… ఎప్పుడూ బయటపడలేదని… ఈ సందర్భంగా చిరు గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు తమ్మారెడ్డి.

ADVERTISEMENT
Latest Stories