చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రాబాబే

Tanneru Harish Rao comments on Chandrababu Naiduతెలుగు దేశం పార్టీ తెలంగాణాలో పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నా ఆ రాష్ట్ర రాజకీయాలన్నీ చంద్రబాబు చుట్టూనే తిరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా కాంగ్రెస్‌ పార్టీ పొత్తులు పెట్టుకుంటోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ ఏం సమాధానం చెబుతుందని హరీశ్‌రావు ప్రశ్నించారు.

[m9ad]

ADVERTISEMENT

సాగునీటి రంగం, ఆస్తుల పంపకం, హైకోర్టు విభజన సహా అనేక అంశాలపై చంద్రబాబు అడ్డుపడుతున్నారని.. ఆయనపై ఆధారపడిన ప్రభుత్వం తెలంగాణలో వస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పటికీ ఆంధ్రా బాబేనని.. తెలంగాణ పక్షం ఆయనెప్పుడూ ఉండరన్నది జగమెరిగిన సత్యమన్నారు.

ఇదంతా బానే ఉంది టీడీపీకి గట్టిగా 15 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది పొత్తులో భాగంగా. 15 కు 15 గెలిచేసి, మహాకూటమి అధికారంలోకి వచ్చినా 15 సీట్లతో చంద్రబాబు ప్రభుత్వంపై ప్రభావం చూపించగలరా? ఇది కేవలం చంద్రబాబును బూచిగా చూపించి కాంగ్రెస్ ను దెబ్బ తీసే ప్రయత్నంగా కనిపిస్తుంది అని కాంగ్రెస్ వారు అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories