విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న “టాక్సీవాలా” సినిమా నవంబర్ 16వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కాగా, తొలుత ‘మాటే వినదుగా’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు. ‘ఇంకేం ఇంకేం కావాలె’ ఫేం సిడ్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట సంగీత, సాహిత్య ప్రియులను ఆకర్షించడంలో సక్సెస్ సాధించింది.
[m9ad]
తాజాగా ఈ పాటకు సంబంధించి ఒక నిముషం వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఓ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరించింది. అయితే ప్రమోషన్ అంతా ఈ “మాటే వినదుగా” ఒక్క పాట చుట్టూనే తిరుగుతుండడంతో, “టాక్సీవాలా”కు ప్రమోషన్ మెటిరీయల్ కోరవండిందేమో అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.
సాధారణంగా విజయ్ దేవరకొండ నటించిన సినిమా ప్రమోషన్ కు కొదవుండదు. అయితే ఈ సినిమాకు గతంలోనే టీజర్, కాన్సెప్ట్ వీడియో వంటివి కొంత పబ్లిసిటీ చేయడంతో, ప్రస్తుతం ఫుల్ రేంజ్ లో వెళ్ళడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత “టాక్సీవాలా”పై ప్రేక్షకులకు ఓ అంచనా వచ్చే అవకాశం కనపడుతోంది.



