ట్రైలర్ టాక్ – నయనతార ‘డోరా’ టైప్ లో ఉందే!

Taxiwaala Theatrical Trailer -Vijay Deverakonda - Priyanka Jawalkarటాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ” టాక్సీవాలా” సినిమా ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆదివారం నాడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ నయనతార “డోరా” సినిమాను గుర్తు చేసింది. ఎలాంటి ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా సినిమాలో తామేం చెప్పాలనుకున్నారో ఈ ట్రైలర్ లో చెప్పేశారు.

ADVERTISEMENT

[m9ad]

కారులో దెయ్యం ఉండడం… దాని నుండి ఫన్నీ సన్నివేశాలను రాసుకోవడం… అలాగే భయపెట్టడం… ఈ కాన్సెప్ట్ అంతా ‘డోరా’లో ప్రేక్షకులు చూసినదే. దానికి మరింత సైన్సును జోడించి ఈ “టాక్సీవాలా”లో చూపించబోతున్నట్లుగా కనపడుతోంది. దెయ్యం ఫార్ములా టాలీవుడ్ ప్రేక్షకులను అలరించే అంశమే అయినప్పటికీ, దానిని తెరపై ఎంత ఆకట్టుకునే విధంగా ప్రజెంట్ చేసారనే దానిపై చిత్ర విజయం ఆధారపడి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories