టాక్సీవాలా – అన్ సీజన్లో ఎలా కొడతాడో!?

Taxiwala Gets The Worse Possible Date 16th November ఏడాదంతా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిన హీరో విజయ్ దేవరకొండ నటించిన మరో చిత్రం “టాక్సీవాలా” మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గీత గోవిందం’తో అనూహ్యమైన హిట్ ను, ‘నోటా’తో అంచనాలు వేసిన ఫట్ ను చవిచూసిన విజయ్ కు, ఈ ఇయర్ ఎండ్ ఎలాంటి కిక్ ను అందిస్తుందో ‘టాక్సీవాలా’ తేల్చనుంది.

[m9ad]

ADVERTISEMENT

నేడు విడుదలైన ‘అమర్ అక్బర్ అంటోనీ’ తప్ప బాక్సాఫీస్ వద్ద ఏ పెద్ద చిత్రము లేకపోవడం ‘టాక్సీవాలా’కు కలిసొచ్చే మరో అంశం. అయితే టాలీవుడ్ కు మోస్ట్ అన్ సీజన్ గా భావించే నవంబర్ విడుదల ప్రతికూలమైన అంశం. అందుకు తగ్గట్లుగానే బాక్సాఫీస్ వద్ద అన్ని సినిమాలు పరాజయం పాలవుతున్నాయి.

ఎన్టీఆర్ రేంజ్ హీరో సినిమాల కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయంటే, ప్రేక్షకుల మైండ్ సెట్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. వీటన్నింటికి తోడు విడుదలకు ముందే రిలీజ్ అయిన ‘టాక్సీవాలా’ పైరసీ. మరి వీటన్నింటిని దాటుకుని విజయ్ దేవరకొండ “టాక్సీవాలా” ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories