Telugu

టీడీపీ ఇచట నాయకులనే కాదు ప్రత్యర్థులను కూడా అందించగలదు!

రాష్ట్రములో ఎన్నో దశాబ్దాల నుండి అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగు వాడి ఆత్మ గౌరవానికి, సామర్ధ్యాన్ని దేశ రాజకీయాలకు పరిచయం చేసింది.

మార్చి 29 ,1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో ఎన్టీఆర్ చేతుల మీదుగా స్థాపించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి ఎందరో రాజకీయ నాయకులను అందించిందనే వాస్తవాన్ని ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే టీడీపీ పార్టీ తన ప్రత్యర్థులను కూడా తానే సిద్ధం చేసుకుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రబాబు లో ఉన్న నాయకత్వ పటిమ కూడా టీడీపీ పార్టీ యే వెలికి తీసింది.

ADVERTISEMENT

తెరాస పార్టీని స్థాపించి ఇప్పుడు దేశంలోనే ఒక ముఖ్య నేతగా ఎదిగిన కేసీఆర్ తెలుగు దేశం పార్టీ నుండి వచ్చిన నాయకుడే. ఈయనే కాదు ఈ పార్టీలో ఉన్న సింహ భాగం నేతలు టీడీపీ పార్టీకి చెందినవారే. వారిలో మోతుకుపల్లి నరసింహులు.., కడియం శ్రీహరి.,తుమ్మల నాగేశ్వర రావు ముఖ్యులు.

బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థిగా పోరాడుతున్న టి.కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సీతక్క కూడా టీడీపీ స్టూడెంట్సే. దేవగౌడా, దయాకర్ రావు, ఆర్.కృష్ణయ్య, బీజేపీ పార్టీలో ఉన్న సుజనా చౌదరి,రమేష్ ..ఇలా చెప్పుకుంటూ పోతే రాసుకుంటూ పోవాల్సిందే అన్న చందంగా ఉంది లిస్ట్.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ పై విరుచుకుపడే కొడాలి నాని, రోజా,తమ్మినేని సీతా రామ్, వల్లభనేని వంశీ., విడుదల రజని లాంటి నేతలెందరో టీడీపీ పాఠశాల నుండి బయటకు వచ్చిన వారే. అయితే ప్రత్యర్థుల పై ఇంతలా విరుచుకుపడే నేతలను టీడీపీ కాపాడుకోలేక పోయిందా? లేక వారే తామ ప్రత్యర్థులుగా మారతారు అనే వాస్తవాన్ని గ్రహించలేకపోయిందా? తప్పెక్కడ జరిగినా పరిణామాల ఫలితాలు రాజకీయ విలువలకు తిరోధకాలు ఇచ్చే విధంగా ఉంటున్నాయి.

టీడీపీ నుండి వచ్చి టీడీపీ ఉనికినే మాయం చేసిన కేసీఆర్ ను తక్కువ అంచనావేశారా? టీడీపీ తోనే తమ రాజకీయ భవిష్యత్ కు బాటలు వేసుకున్న నాని, రోజా,వల్లభనేని వంటి వారిని కట్టడి చేయడంలో టీడీపీ విఫలమయ్యినదా? అనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఉదాసీనతే వీరి పైచకానికి నాంది పలికిందా అన్న చందంగా వీరి రాజకీయ విమర్శలు ఉంటాయి.

రాజకీయాలలో నేతలు పార్టీల జెండాలను మార్చడం ఎవరు తప్పుపట్టారు, అది సహజమే. కానీ పార్టీల జెండాలు మార్చగానే విలువలను సమాధి చేస్తూ సిద్ధాంత పరమైన విమర్శలు కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడమే వారి మానసిక వైకల్యానికి అద్దం పడుతుంది.తానూ తయారు చేసిన నేతలే తనను, తన పార్టీని బలహీన పరుస్తున్న ఎక్కడా జంకకుండా రాజకీయాలలో ముందడుగు వేస్తూనే ఉంది తెలుగు దేశం పార్టీ.

ఎంతమంది నేతలు పార్టీని వీడినా మరల కొత్త రక్తాన్ని రాష్ట్ర రాజకీయాలకి పరిచయం చేయడంలో మాత్రం తెలుదేశం పార్టీ వెనకడుగు వేయలేదు అని చెప్పక తప్పదు. రాజకీయాలకు కొత్త నాయకులను అందించడంలోనే కాదు తమకు ప్రత్యర్థులను తయారు చేయడంలో కూడా టీడీపీ ముందు వరుసలోనే ఉందని ఒప్పుకోక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చి చంద్రబాబుని వేలెత్తి చూపడమా?

స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…

8 minutes ago

No Stress For Hero, But Full High For Fans!

Making a commercial action film with a 75-year-old superstar is not an easy task. However,…

9 minutes ago