కొడాలి విషయంలో కూటమి వెనక్కి తగ్గిందా.?

Kodali Nani political controversy and questions on TDP action

కొడాలి నాని…గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొంతు కన్నా ఈయన గొంతే మీడియాలో ఎక్కువ వినిపించేది, టీడీపీ శ్రేణులను కవ్వించేది. నందమూరి కుటుంబం పేరు చెప్పుకుంటూ నారా కుటుంబం పై వ్యక్తిగత దాడి చెయ్యడం కొడాలి అలవాటుగా మారిపోయింది.

నాడు టీడీపీ ప్రజా సమస్యల పై గళం ఎత్తితే కొడాలి నాని నారా – నందమూరి కుటుంబ సమస్యలు లేవనెత్తే వారు. చంద్రబాబు మామ ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు అంటూ మొదలుపెట్టి తారక్ కు అన్యాయం చేస్తున్నారు అంటూ ముగించేవారు.

ADVERTISEMENT

నాటి వైసీపీ హయాంలో కొడాలి నాని నోటికి చంద్రబాబు కుటుంబం మొత్తం బలైందనే చెప్పాలి. బాబు తో మొదలు పెట్టి లోకేష్ వరకు వాడు, వీడు అంటూ నోటితో చెప్పలేని భాషతో, చెవులు వినలేని పదజాలంతో రాజకీయంగా ఉన్న అన్ని హద్దులుదాటి మరి కొడాలి బాబు కుటుంబం పై విరుచుకుపడ్డాడు.

ఒకానొక సమయంలో కొడాలి చర్యలకు, చేష్టలకు టీడీపీ తమ్ముళ్ల రక్తం ప్రతీకార వాంఛతో రగిలిపోయింది. బాబు అరెస్టయిన సందర్భంలో కూడా మానవత్వం మరిచి కొడాలి చేసిన వ్యాఖ్యలు యావత్ తెలుగు ప్రజల హృదయాలను కలిచివేశాయి.

అంతలా బాబు కుటుంబాన్ని టార్గెట్ చేసిన, టీడీపీ పార్టీ పతనాన్ని కోరుకున్న కొడాలి తప్పక మూల్యం చెల్లించాల్సిందే అనే భావన టీడీపీ క్యాడర్ లోనే కాదు ప్రతి ఒక్క ఓటర్ లో కూడా స్ఫష్టంగా కనపడింది.

అందులో భాగంగానే ప్రజాగళం పాదయాత్రలో నారా లోకేష్ సైతం రెడ్ బుక్ లో మొదటి పేజీ కొడాలి నాని కోసం ఎదురుచూస్తుంది అంటూ ప్రకటించారు. ఆ ఒక్క ప్రకటన టీడీపీ శ్రేణులకు అంతులేని బలాన్నిచ్చింది.

అయితే కొడాలి చేస్తున్న బూతు రాజకీయాలతో టీడీపీకి ప్రజలలో ఎంత సానుభూతి వచ్చిందో అలాగే వైసీపీ పట్ల ప్రజలలో అంతే వ్యతిరేకత వచ్చింది. దాని ఫలితమే ‘గుడివాడ నా అడ్డా ఎవరొస్తారో చెప్పు బిడ్డా’ అంటూ నాడు తొడలు కొట్టిన నాని నేడు గుడివాడలో అడుగుపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు.

అయితే జగన్ అండ చూసుకుని అంతలా రెచ్చిపోయిన కొడాలిని కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే అరెస్టు చేస్తుందని అందరు భావించారు. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర్ర గడుస్తున్నా ఇంకా కొడాలి విషయంలో కూటమి వెనకంజ వేస్తూనే వస్తుంది.

వల్లభనేని వంశీ విషయంలో ముందుకొచ్చిన టీడీపీ కొడాలి విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతుంది.? ఎవరైనా అదృష్ట శక్తి కొడాలి వెనుక రక్షణ కవచంలా అడ్డుపడుతున్నారా.? కొడాలిని కాపాడుతున్న ఆ కవచం ఏమిటి.? కొడాలి పై చర్యలకు టీడీపీ కి సంకెళ్లు వేస్తున్న కారణాలేంటి.? ఇలా ఎన్నో ప్రశ్నలు టీడీపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories